Visakhapatnam: మధురవాడ జోన్లో జీవీఎంసీ ఎన్నికల సన్నాహాలపై సమీక్ష
Visakhapatnam: మధురవాడ జోన్ కార్యాలయంలో జీవీఎంసీ ఎన్నికల సన్నాహాలపై ఉన్నత స్థాయి సమీక్ష. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.
Visakhapatnam: మధురవాడ జోన్లో జీవీఎంసీ ఎన్నికల సన్నాహాలపై సమీక్ష
విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా మధురవాడ జోన్ కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ఏడీసీ) వెంకట రమణ, డీపీవో నాగర్జున పాల్గొని, ఎన్నికల సన్నాహకాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు జోన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా పరిశీలన, ఇతర క్షేత్రస్థాయి కార్యకలాపాల ప్రగతిని ఉన్నతాధికారులకు సవివరంగా వివరించారు.
అనంతరం, ఎన్నికల సంబంధిత పనుల పురోగతిపై సీనియర్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో, నిబంధనలకు లోబడి అన్ని ప్రాధాన్యత పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.




