Visakhapatnam: సోమవారం జీవీఎంసీలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
Visakhapatnam: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (GVMC) పరిధిలో జూన్ 22, సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహించనున్నారు.
Visakhapatnam: సోమవారం జీవీఎంసీలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
Visakhapatnam: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, పునర్వ్యవస్థీకరణ చెందిన భీమిలి, మధురవాడ , ఈస్ట్, వెస్ట్, సౌత్ ,నార్త్, పెందుర్తి ,గాజువాక, అగనంపూడి అనకాపల్లి జోన్ల కార్యాలయాల్లోనూ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం" 2026 జూన్ 22 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు.
కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై 2026 జూన్ 22 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు జివిఎంసి కమిషనర్ తెలియచేశారు.
గమనిక: 1) జీవీఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయం 52 వ వార్డు లో గల ఎన్. ఎ .డి కొత్త రోడ్డు , గౌరీ నగర్ లో పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నందు ఏర్పాటు చేయడమైనది.
2) నార్త్ జోన్ కార్యాలయం 51 వ వార్డులో మాధవధార ఉడా లేఅవుట్, ఆర్ . టి. ఎ ఆఫీస్ రోడ్డు, పంప్ హౌస్ వెనుక ఉత్తర నియోజకవర్గం కార్యాలయం లో ఏర్పాటు చేయడమైనది.
3) అగనంపూడి జోన్ కార్యాలయం 85వ వార్డులో పెదమడక, శివాలయం రోడ్డు , వినాయక టెంపుల్ సమీపములో గల రాజీవ్ గాంధీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడమైనది.
కావున ప్రజలు ఈ పై జోన్ల ప్రదేశాలను గమనించవలసిందిగా కోరుచూ ,మిగిలిన అన్ని జోన్ల కార్యాలయాలు యధాస్థానంలో ఉన్నవని తెలియపరచడమైనది.




