Visakhapatnam: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 87 వినతులు!
Visakhapatnam: విశాఖ జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 87 వినతులు అందాయి. ఈ నెల 19, 20 తేదీల్లోనూ ఫోరం కొనసాగనుంది.
Visakhapatnam: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 87 వినతులు!
విశాఖ: జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 87 వినతులు అందాయి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు, అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి 84, ఏపీడీపీఎంఎస్ కు సంబంధించి 3 అర్జీలు స్వీకరించారు.
ఈసందర్భంగా ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి (సీసీపీ) జి.వి.జి.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. కొన్ని వినతులను అక్కడికక్కడే పరిష్కరించామని,పెండింగ్ దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఈ ఓపెన్ ఫోరం ఈ నెల 19, 20 తేదీల్లోనూ కొనసాగుతుందని, దరఖాస్తుదారులు, ఎల్టీపీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి, డీసీపీలు వెంకటేశ్వరరావు, హరిదాస్, రామ్మోహనరావు, మధుసూదన్ రావు, ఏసీపీలు, టీపీలు, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.




