Visakhapatnam: విశాఖలో శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

Visakhapatnam: విశాఖపట్నంలో శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 26 Sept 2026 11:08 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పూర్ణ మార్కెట్ సమీపంలోని కొండపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న హోంమంత్రి అనితకు దేవస్థాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు.

దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా,ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఆప్యాయంగా మాట్లాడిన హోంమంత్రి అనిత వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో,ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ సత్యనారాయణ స్వామిని వారిని మంత్రి ప్రార్థించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.