Visakhapatnam: రుషికొండ బీచ్ తీరంలో సందడి చేసిన రెండు హోవర్ క్రాఫ్ట్స్!

Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్‌కు చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ హోవర్ క్రాఫ్ట్స్. నేలపై, నీటిపై వెళ్లే వాహనాలను ఆసక్తిగా తిలకించిన పర్యాటకులు.

JAI RAM, MADURAWADA
Published on: 6 Nov 2026 7:15 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: రుషికొండ బీచ్ తీరంలో సందడి చేసిన రెండు హోవర్ క్రాఫ్ట్స్!

Visakhapatnam: విశాఖపట్నం నగరంలోని రుషికొండ బీచ్ తీరానికి గురువారం సాయంత్రం రెండు హోవర్ క్రాఫ్ట్స్ చేరుకున్నాయి. నేలపై, నీటిపై ప్రయాణించే ప్రత్యేక సామర్థ్యం కలిగిన ఈ హోవర్ క్రాఫ్ట్స్ సముద్రం నుంచి తీరం వైపు ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. తీర ప్రాంత భద్రత, సముద్ర నిఘా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ ప్రత్యేక వాహనాలను బీచ్‌కు వచ్చిన పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. హోవర్ క్రాఫ్ట్స్ రాకతో రుషికొండ బీచ్ వద్ద సందడి నెలకొంది.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA