Visakhapatnam: వైజాగ్లో ఘనంగా జర్నలిస్టుల దసరా వేడుకలు
Visakhapatnam: విశాఖ శ్రీ కాంతి థియేటర్లో పాత్రికేయ సంఘాల ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం అవసరమని నేతలు పిలుపునిచ్చారు.
Visakhapatnam: వైజాగ్లో ఘనంగా జర్నలిస్టుల దసరా వేడుకలు
విశాఖపట్నం: పాత్రికేయుల ఐక్యతకు ప్రతీకగా.. ఆత్మీయతలు, ఆనందోత్సాహాల నడుమ దసరా సంబరాలు అంబరాన్నంటాయి. జర్నలిస్టుల కలయికలు, ఆత్మీయ పలకరింపులు, సందడి నడుమ నిర్వహించిన వేడుకలు పండుగ శోభను సంతరించుకున్నాయి.
కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు సభికులను విశేషంగా ఆకట్టుకుని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఇక్కడ శ్రీ కాంతి థియేటర్ లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఏపీ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో దసరా సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు..
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం అవసరం
ఈ సందర్భంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత, సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాలకులు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తోందని అన్నారు. అలాంటి పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జర్నలిస్టు సంఘాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన, వృత్తిపరమైన గౌరవం కోసం సంఘాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాత్రికేయుల ఐక్యతే వారి సమస్యల పరిష్కారానికి ప్రధాన బలమని పేర్కొన్నారు.
సమాజానికి పాత్రికేయుల సేవలు ఎంతో విలువైనవి: చెల్లుబోయిన నర్సింగరావు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఎన్ఆర్ వెంచర్స్ అధినేత చెల్లుబోయిన నర్సింగరావు మాట్లాడుతూ.. సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ప్రజా సమస్యలను సమాజం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వాల దృష్టికి ప్రజల ఇబ్బందులను తీసుకెళ్లడం, ప్రజలకు సమాచారాన్ని అందించడం వంటి బాధ్యతలను జర్నలిస్టులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. పాత్రికేయులు నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కరిస్తూనే సాంప్రదాయ పండుగులు నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు.. జర్నలిస్టులకు తన వంతు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందన్నారు.. సమాజాభివృద్ధిలో జర్నలిస్టులు పాత్ర అత్యంత ప్రశంసనీయం అన్నారు..
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, స్నేహభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పండుగలు కేవలం ఆనందాన్ని పంచుకోవడానికే కాకుండా, ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయతలను పెంపొందించుకోవడానికి, సమాజ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి చక్కని అవకాశాలని పేర్కొన్నారు. పాత్రికేయుల సంక్షేమం, వారి కుటుంబాల అభ్యున్నతి, వృత్తిపరమైన గౌరవం పెంపొందించే దిశగా అందరూ కృషి చేయాలని సూచించారు.
నృత్య ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణ
దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. నృత్య భారతి అకాడమీకళాకారుల ప్రదర్శనలకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. పండుగ ఉత్సాహం, పాత్రికేయుల ఆత్మీయ కలయిక, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంతో వేడుకలు సందడిగా సాగాయి. పరస్పర శుభాకాంక్షలు, స్నేహపూర్వక పలకరింపులతో కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ బాబు..ఎన్ టి పి సి డీజీఎం కుప్పిలి శ్రీకాంత్ .. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ ..ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్ ..బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు కార్యదర్శి కింతాడ మదన్.. జాయింట్ సెక్రెటరీ లు మల్ల దేవ త్రినాథ్..నాయుడు..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ ..కార్యదర్శి శ్రీనివాస్.. ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎన్.రామ కృష్ణ..కృష్ణ మూర్తి నాయుడు.. పిల్లా నగేష్ బాబు.. కార్యవర్గ సభ్యులు బొబ్బర ప్రసాద్.. రాజశేఖర్ విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వై రామకృష్ణ.. క్రైమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెస్సార్ ప్రసాద్..సభ్యులు భానోజీ ఎం వి రాజ శేఖర్... గాయకులు సత్య ప్రసాద్.. హర్ష వర్ధని.. పాల్గొన్నారు.




