Visakhapatnam: ఏపీలో తొలిసారి రెట్టియస్-స్పేరింగ్ రోబోటిక్ ప్రోస్టేటెక్టమీ!
Visakhapatnam: విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ (MGCHRI) ఏపీలో తొలిసారి రెట్టియస్-స్పేరింగ్ రోబోటిక్ ప్రోస్టేటెక్టమీ నిర్వహించి 150 రోబోటిక్ సర్జరీల మైలురాయిని చేరింది.
Visakhapatnam: ఏపీలో తొలిసారి రెట్టియస్-స్పేరింగ్ రోబోటిక్ ప్రోస్టేటెక్టమీ!
విశాఖపట్నం, నవంబర్ 21, 2026: మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (MGCHRI) 150 సంక్లిష్ట రోబోటిక్ యూరో-ఆంకాలజీ శస్త్రచికిత్సలను నిర్వహించి, రోబోటిక్ యూరో-ఆంకాలజీలో "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence)" " తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ప్రొస్టేట్ క్యాన్నర్ చికిత్సలో అదునాతన శస్త్రచికిత్స విధానమైన రెట్టియస్- స్పేరింగ్ రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీని ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా నిర్వహించిన ఆసుపత్రిగా MGCHRI నిలిచింది.
ఈ విధానంలో మూత్ర నియంత్రణకు సహాయపడే కీలక శరీర నిర్మాణాలను పరిరక్షించడం ద్వారా, ఎంపిక చేసిన రోగుల్లో మూత్ర నియంత్రణ త్వరగా పునరుద్ధరించబడటంతో పాటు జీవన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ శస్త్రచికిత్సల్లో 78 ప్రొస్టేట్ శస్త్రచికిత్సలు, 40 పార్టియల్ నెఫెక్టమీలు, 20 రాడికల్ నెఫ్రెక్టమీలు, 10 రాడికల్ సిస్టెక్టమీలు, పోస్ట్ కిమోథెరపీ RPLND తదితర సంక్షిప్త శస్త్రచికిత్సలు ఉన్నాయి.
కిడ్నీ పరిరక్షణకు సంక్లిష్ట రోబోటిక్ పార్టియల్ నెఫ్రెక్టమీ
అధునాతన రోబోటిక్ టెక్నాలజీ, 3D ఇమేజింగ్ సాంకేతికత సహాయంతో మూత్రపిండాల్లోని సంక్షిప్త కణితుల స్థానం, పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించి శస్త్రచికిత్సను ప్రణాళికాబద్ధంగా నిర్వహించవచ్చు. రోబోటిక్ పార్టియల్ నెఫెక్టమి ద్వారా క్యాన్సర్ కణితిని తొలగిస్తూ, ఆరోగ్యకరమైన మూత్రపిండ కణజాలాన్ని సాధ్యమైనంత వరకు పరిరక్షించవచ్చు. తద్వారా అర్హులైన రోగుల్లో మూత్రపిండాన్ని కాపాడటంతో పాటు దాని పనితీరును సంరక్షించే అవకాశం ఉంటుంది.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రోబోటిక్ యూరో-ఆంకాలజీ
MGCHRIలో ప్రత్యేక యూరో-అంకాలజీ వైద్య నిపుణుల బృందం, మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డు, అధునాతన రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రోగుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమగ్ర క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.
డా. మురళీకృష్ణ వున్న, మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లోనే అత్యాధునిక సూపర్ సబ్ స్పెషాలిటీ క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ప్రత్యేక వైద్య నైపుణ్యం, ఆధునాతన సాంకేతికత, వివిధ వైద్య విభాగాల సమన్వయంతో సమగ్ర క్యాన్సర్ చికిత్స అందిస్తున్నాం."
డా. రూపాలి బసు, రీజినల్ బిజినెస్ హెడ్ (ఈస్ట్ & ఆంధ్రప్రదేశ్), హెచ్‌సీజీ హాస్పిటల్స్ మాట్లాడుతూ MGCHRI సాధించిన ఈ విజయం అధునాతన క్యాన్సర్ వైద్య సేవలను రోగులకు మరింత చేరువ చేస్తుందన్నారు. రోబోటిక్ సర్జరీ, 30 ఇమేజింగ్ ద్వారా అవయవాల పరిరక్షణ, శస్త్రచికిత్స ప్రభావాన్ని తగ్గించడం, రోగులు సురక్షితంగా కోలుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు.
డా. రాహుల్ తేజ్ పి., కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ మాట్లాడుతూ "రెట్టియస్- స్పేరింగ్ ప్రొస్టేటెక్టమీ, స్టేటెక్టమీ సంక్షిప్త పార్టియల్ నౌఫ్రెక్టమీ, పోస్ట్ కీమోథెరపీ RPLND వంటి అధునాతన రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా సంక్షిప్త యూరాలజికల్ క్యాన్సర్లకు కచ్చితత్వంతో చికిత్స అందించవచ్చు. అవయవాల పరిరక్షణ, రోగుల భద్రత, శస్త్రచికిత్స అనంతర కోలుకోవడం, జీవన నాణ్యతను మెరుగుపరచడమే మా ప్రధాన లక్ష్యం.




