Visakhapatnam: ఆనందపురంలో డిగ్రీ కాలేజీ భవనం ప్రారంభం!

Visakhapatnam: ఆనందపురంలో సమిష్టి కృషితో నిర్మించిన నూతన డిగ్రీ కాలేజీ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించి, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

SHIVA, BHIMILI
Published on: 8 Oct 2026 6:41 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఆనందపురంలో డిగ్రీ కాలేజీ భవనం ప్రారంభం!

Visakhapatnam: ఆనందపురం, అక్టోబర్ 8: సమిష్టి కృషితోనే ఆనందపురంలో డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం సాధ్యపడిందని, నాణ్యతతో రాజీ పడకుండా ఏడాది సమయంలోనే పూర్తి చేసుకోగలిగామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. డిగ్రీ కాలేజీ భవనాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాలేజీ చుట్టూ రక్షణ గోడ, ఫర్నిచర్ ఏర్పాటు చెయ్యడానికి కృషి చేస్తానన్నారు.

చదువుతో పాటు నైతిక విలువలు నేర్పి భావి భారతానికి మంచి పౌరులను అందించాలని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావంతో చేరుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్రీవాణి మాట్లాడుతూ పీఎం ఉషా నిధులు వెనక్కి వెళ్లిపోయే స్థితిలో గంటా శ్రీనివాసరావు జోక్యం చేసుకుని 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పించి భవనాన్ని నిలబెట్టారని, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ కు అండగా నిలిచారని తెలియజేశారు.

కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, కసిరెడ్డి దామోదరరావు, గంటా నూకరాజు, బమ్మిడి ఉమ, డి.ఎ.ఎన్. రాజు, శివాజీ, బోని ప్రసాద్, రామరాజు, ఎర్ర రాజు, ఎల్ వి. రమణ, శ్రీను, గరే సదానంద, కాకర రమణ, నాగోతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నోట్: ఫోటోలు ఉన్నాయి.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI