Gajuwaka: 65వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన పల్లా శ్రీనివాసరావు
Gajuwaka: గాజువాక 65వ వార్డులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పింఛన్లు పంపిణీ చేశారు. అక్టోబర్‌లో కొత్త పింఛన్లు ఇస్తామన్నారు.
Gajuwaka: 65వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన పల్లా శ్రీనివాసరావు
గాజువాక: 65 వార్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా వికాస్ నగర్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం వార్డ్ అధ్యక్షులు రట్టి వాసు అధ్యక్షతన చేపట్టారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ లో వృద్ధులు వితంతువులకు కొత్త పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది పైగా లబ్ధిదారులకు ప్రతినెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2700 కోట్లు పంపిణీ చేస్తామని ఎన్నికల ఇచ్చిన ప్రతి హామీని పారదర్శంగా దశలవారీగా హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన పార్టీ గాజువాక నియోజవర్గం ఇన్చార్జి శ్రీ కోన తాతారావు. తిప్పల రమణ రెడ్డి. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి. వార్డ్ మాజీ కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




