Visakhapatnam: విశాఖలో ఘనంగా ముస్లిం ఉచిత వివాహ పరిచయ వేదిక

Visakhapatnam: విశాఖపట్నం 42వ వార్డు పరిధిలోని హోటల్ సింకా గ్రాండ్‌లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ 13వ ముస్లిం ఉచిత వివాహ పరిచయ వేదికను ఘనంగా నిర్వహించారు.

GOPI, PENDURTHI
Published on: 21 Jun 2026 6:00 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో ఘనంగా ముస్లిం ఉచిత వివాహ పరిచయ వేదిక

Visakhapatnam: జీవీఎంసీ 42 వ వార్డు టి ఎస్ ఎన్ కాలనిలో హోటల్ సింకా గ్రాండ్ లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 13 వ పర్యాయంగా ఆదివారం ముస్లిం వివాహ పరిచయ వేదిక నిర్వహించారు.ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాపతంగా పలువురు ముస్లింలు పాల్గొని వారి అర్హతలను బట్టి వారి తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నారు.

ఈ సందర్బంగా సొసైటీ అధ్యక్షుడు హైదరాలి సింకా మాట్లాడుతుతమ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 13 సార్లు ఉచిత వివాహ పరిచయ వేదికలు, ఏర్పాటు చేశామని, ఇంత వరకు 300 వివాహాలు చేసుకొని ఒక్కటయ్యారని తెలిపారు. సుమారు 200 యువతి యువకులు వారి తల్లి తండ్రులు ఈ రోజు జరిగిన వివాహ పరిచయ వేదికలో పాల్గొన్నారన్నారు. ఇది పూర్తిగా ఉచిత సేవ అని, వివాహ వేదికకు ఈ హోటల్ ను కుడా ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికిమధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని,పేద ముస్లిం లకు తమ సొసైటీ తరపున షాదీ ఖర్చులు భరించి వివాహాలు జరిపిస్తున్నామని సింకా ఈ సందర్బంగా తెలిపారు.ఈ ఉచిత వివాహ పరిచయ వేదికకు అనూహ్య స్పందన వస్తోందన్నారు.

కార్యక్రమం లో సొసైటీ గౌరవ అధ్యక్షుడు మునీర్ ఖాన్ బాబా, హాజీ షేక్ మునీర్, వైస్ ప్రెసిడెంట్ హాజీ మీర్ అబ్బాస్ హుసేన్, కార్యదర్శి సయ్యద్ అమీర్ జాన్, జాయింట్ సెక్రటరీ మహబూబ్ అలీఖాన్, కోశాదికారి షేక్ అహమ్మద్ వలి, అడ్వకెట్ ఎం ఎ రజాక్, కమిటీ సభ్యులు అబ్దుల్ మునీర్ ముషాద్, హాజీ రెహమతుల్లా, మహబూబ్ షరీఫ్, మహమ్మద్ లక్మాన్, అస్జగర్ అలి, మహమ్మద్ అస్లం తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story