Visakhapatnam: ఎంవీవీ గ్రీన్‌ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Visakhapatnam: విశాఖపట్నం ఎండాడ దశపల్లా లేఅవుట్‌లోని ఎంవీవీ గ్రీన్‌ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.

SHIVA, BHIMILI
Published on: 31 Aug 2026 9:51 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఎంవీవీ గ్రీన్‌ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

విశాఖపట్నం: ఎండాడ దశపల్లా లేఅవుట్‌లోని ఎంవీవీ గ్రీన్‌ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, ముఖ్య సలహాదారుగా కేవీ బాబా, అధ్యక్షులుగా పి. సింహాచలం, ఉపాధ్యక్షురాలిగా ఎ. రేవతి, కార్యదర్శిగా సి.హెచ్. నారాయణరావు, కోశాధికారిగా కె. తిరుమలరావు ఎన్నికయ్యారు.

సంయుక్త కార్యదర్శులుగా భాస్కరరావు, ఏవి. శేషగిరిరావు, సంయుక్త కోశాధికారులుగా రామరాజు, ఎన్.వి. ఫణి, న్యాయసలహా దారుని గా రామన్, సలహా దారిని గా ధరని, కార్యనిర్వాహక సభ్యులు గా సోమశేఖర్, డివి రాదా ప్రసాద్, కార్యవర్గ సభ్యులు గా కోటేశ్వరరావు, శ్రీ గిరి, రఘు,సభ్యులు గా దీపిక, మహె, రామ ప్రసాద్, కార్డ్ లైబ్రరీ సభ్యునిగ శ్రీ హిత, రాజేశ్వరి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి అందరూ ఐకమత్యంతో పనిచేసి, పచ్చని క్షేత్రాన్ని బంగారు క్షేత్రంగా తీర్చిదిద్దాలని కోరారు. నూతన కమిటీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.మనం ఐక్యంగా ఉండి మన సమాజాన్ని మరింత మంచి ప్రదేశంగా తీర్చి దిద్దుదామని అన్నారు. ఈ మేరకు అందరికి ఎం వి వి సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story