Visakhapatnam: గంభీరంలో 'ప్రేమోదయం' సేవా కేంద్రం ప్రారంభం

Visakhapatnam: విశాఖపట్నం గంభీరంలో 'ప్రేమోదయం' సమగ్ర సేవా కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సేవా సంస్థలు పాల్గొన్నాయి.

SHIVA, BHIMILI
Published on: 31 Aug 2026 11:14 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: గంభీరంలో 'ప్రేమోదయం' సేవా కేంద్రం ప్రారంభం

విశాఖపట్నం: పద్మశ్రీ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ గారి ఉదారమైన సహకారం మరియు విరాళంతో, విశాఖపట్నం జిల్లా గంభీరంలో 6 ఎకరాల విస్తీర్ణంలో “ప్రేమోదయం” అనే భారత దేశం లోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన సహకార సేవా కేంద్రం ప్రారంభోత్సవం ను ఈ రోజు గౌరవ విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అతిధుల సమక్షములో ప్రారంభించడం జరిగింది .

ఈ ప్రాంగణంలో విద్య, సామాజిక సంక్షేమం, ఆరోగ్య సేవలు మరియు సమాజ సేవకు సంబంధించిన పలు కార్యక్రమాలు ఒకే వేదికగా కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో హరే కృష్ణ మూవ్‌మెంట్ (HKM), ఏజ్ కేర్ ఫౌండేషన్ , ప్రేమ విద్యా సంస్థలు మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ (TAPF) వంటి ప్రముఖ సేవా సంస్థలు భాగస్వామ్యం తో పని చేయు చున్నారు .

తేదీ & సమయం: సోమవారం, 31 ఆగస్టు 2026 | మధ్యాహ్నం 2:00 గంటల నుండి

వేదిక: ఐఐఎం రోడ్, గంభీరం, ఆనందపురం మండలం, విశాఖపట్నం

ముఖ్య అతిథులు

శ్రీ నారా లోకేష్ గారు, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ ఎం. శ్రీ భరత్ గారు, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు, విశాఖపట్నం, శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, గౌరవనీయ శాసనసభ సభ్యులు, భీమిలి

ప్రారంభించిన కార్యక్రమాల వివరాలు

మొదటగా హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ శ్రీ నిష్క్రించిన భక్త దాస గారు మరియు శ్రీ సుంకర శశి కిరణ్ గారు మరియు డాక్టర్ రొక్కం శశి ప్రభ గారు శ్రీ నారా లోకేష్ గారికి పూర్ణ కుంభముతో శ్రీ శ్రీ రాధా మధన మోహన్ మందిరం కు స్వాగతం పలకడం జరిగింది .

మంత్రిగారు మరియు అతిధులు హరే కృష్ణ మూవ్మెంట్ వ్యస్థాపక ఆచార్యులు శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాదులవారికి పూలు సమర్పించి అనంతరం శ్రీ శ్రీ రాధా మధన మోహన్ స్వామివారిని దర్శించినారు .

అక్షయ పాత్ర వంటశాల సందర్శన లో మధ్య్యనా భోజనం అధునాతన యంత్రములులతో తయారు చేయు విధానమును డాక్టర్ నిష్క్రించిన భక్త దాస స్వామిజి గారిని అడిగి తెలుసుకున్నారు . వంటశాల శుచి శుభ్రత చూచి ప్రశింసించారు. పాఠశాల ప్రారంభంలో ఉదయం వారములో మూడు రోజులు అందచేయు ఆరతి పందు , శనగలు మరియు మసాలా గ్రౌండ్ నట్స్ ను పరిచిలించి పోశాఖకార విలువలు గురించి తెలుసుకున్నారు .

హరే కృష్ణ వైకుంఠంలో శ్రీ రాధా కృష్ణ మందిర నిర్మాణం భూమి పూజ లో నిర్వహించిన యజ్ఞములు పూర్ణాహుతి కార్యక్రమము మరియు భూమి పూజను వేదమంత్రముల నడుమ మంత్రిగారు మరియు అతిధులు నిర్వహించడం జరిగింది .

శిలాఫలకం ను డిజిటల్ గా ప్రారంభించడం జరిగింది .

డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు మంత్రిగారికి మరియు అతిధులు శ్రీ గంటా శ్రీనివాస రావు , శ్రీ ఎం .భారత్ గారు ,శ్రీ పల్లా. శ్రీనివాస్ గారిని సన్మానించి ఆలయ ప్రసాదం అందచేయడం జరిగింది .

హరే కృష్ణ వైకుంఠం – శ్రీ శ్రీ రాధా మదన మోహన్ ఆలయంలో దర్శనం

ది అక్షయ పాత్ర ఫౌండేషన్ (TAPF) సెంట్రలైజ్డ్ కిచెన్ సందర్శన

నిర్మించనున్న శ్రీ శ్రీ రాధా కృష్ణ ఆలయానికి భూమి పూజ

మధ్యాహ్నం 3:00 గంటలకు

మంత్రి గారు మరియు అతిధులు ప్రేమ విద్యాలయాల క్యాంపస్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది శిలాఫలకం ఆవిష్కరణ మరియు పద్మ శ్రీ డాక్టర్ ఎస్ .వీ .ఆదినారాయణ గారు నిర్వహించిన సేవ కార్యక్రమాలు ఫోటో ప్రదర్శన తిలకించారు ఈ కార్యక్రమము లో శ్రీ సుంకరి శశి కిరణ్ చైర్మన్ , డాక్టర్ రొక్కం శశి ప్రభ మరియు శ్రీ దుగ్గి .రాజు గారు పాలుగున్నారు.

పద్మ శ్రీ డాక్టర్ ఎస్ .వీ .ఆదినారాయణ గారు నిర్వహించిన సేవ కార్యక్రమాలు గురించి మంత్రి గారు కొనియాదిన్నరు.

మధ్యాహ్నం 3:30 గంటలకు

స్నేహసంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం శిలాఫలకం తో ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమములో డాక్టర్ జి. సాంబశివరావు గారు,చైర్మన్, స్నేహసంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ , శ్రీ నరేష్ గారు మరియు డాక్టర్ న్ ఎస్ న్ రాజు గారు మంత్రిగారికి స్వాగతమ్ పలికినారు. స్నేహసంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసు కున్నారు.

హరే కృష్ణ మూవ్‌మెంట్ (HKM), అక్షయ పాత్ర ఫౌండేషన్ (TAPF) , ప్రేమ విద్య సంస్థలు మరియు స్నేహసంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ సేవా సంస్థలు కలిసి ప్రాంతంలో అర్థవంతమైన, సుస్థిరమైన సామాజిక మార్పు కోసం చేస్తున్న సమిష్టి కృషిని ప్రజలకు చేరవేయడంలో ఎంతో సహాయపడుతుంది.

డాక్టర్ రొక్కం శశి ప్రభ గారు, చైర్‌పర్సన్, ఫ్రీ పోలియో సర్జికల్ & రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ జి. సాంబశివరావు గారు, చైర్మన్, స్నేహసంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్, డాక్టర్ నిష్కించన భక్త దాస గారు, ప్రెసిడెంట్, హరే కృష్ణ మూవ్‌మెంట్ & అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు మంత్రిగారికి మరియు అతిధులకు ధన్యవాదములు తెలియచేయడం జరిగింది .

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story