Visakhapatnam: విశాఖ వన్ టౌన్‌లో ఘనంగా మెగా ఉచిత వైద్య శిబిరం

Visakhapatnam: విశాఖపట్నం వన్ టౌన్ వాసవి భవన్‌లో ఆర్యవైశ్య యువజన సంఘం, శంకర్ ఫౌండేషన్, వి హెల్త్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

GOPI, PENDURTHI
Published on: 21 Jun 2026 5:08 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ వన్ టౌన్‌లో ఘనంగా మెగా ఉచిత వైద్య శిబిరం

Visakhapatnam: ఆర్యవైశ్య యువజన సంఘం, శంకర్ ఫౌండేషన్, మరియు వి డెంటల్, వి హెల్త్ కేర్ ల సంయుక్త ఆధ్వర్యాన ఆదివారము స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల వాసవి భవన్ లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు నేతి శ్రీనివాసరావు, కట్టమూరి సూర్యనారాయణ లు తెలిపారు.

కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు నేతి శ్రీనివాస రావు మాట్లాడుతూ సమాజంలో కుల సంఘాలు, సేవా దృక్పథం గల సంస్థలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య శిబిరాలను నిర్వహించి వారికి వైద్యానికి సంబందించిన సలహాలు, సూచనలు, అవసరమైన మేరకు చికిత్స అందించాలన్నారు.

ఆర్యవైశ్య యువజన సంఘం వారు విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో ప్రజలకు శంకర్ ఫౌండేషన్ వారి ద్వారా కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్, ఆప్టికల్ పవర్ టెస్టింగ్, కేటరాక్ట్, రెటీనా, గ్లూకోమా వంటి పరీక్షలలు, వి హెల్త్ కేర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ వారి సహాయంతో డెంటల్, ఈఎన్టి, గైనిక్ వంటి విభాగాలలో పరీక్షలు మరియు బీపీ షుగర్ ఈ సి జి పరీక్షలు మరియు అవసరమైన మందులు, కళ్ళద్దాలు వంటివి అతి తక్కువ ధరలకు అందించటం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం కార్యదర్శి కట్టమూరి సూర్యనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో చక్కెర వ్యాధి విస్తృతంగా వ్యాపించినదని, చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడటానికి అస్తవ్యస్త జీవన విధానమే ముఖ్య కారణం అని నిపుణుల సూచనలతో మంచి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం లేదా నడక అలవాటు చేసుకుంటే చక్కెర వ్యాధిని అదుపులో పెట్టవచ్చని అన్నారు.

ఆర్యవైశ్య యువజన సంఘం లక్ష్యాలలో ఒకటైన సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో విశాఖలో పేరొందిన శంకర్ ఫౌండేషన్ మరియు వి హెల్త్ కేర్ వారి సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో అవసరం అయిన వారికి కళ్ళద్దాలు, మందులు, సలహాలు ఉచితంగా అందించడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరంలో వన్ టౌన్ లో కోటవీధి, లక్ష్మి టాకీస్, అంబుసరంగువీధి, పాతపోస్టాఫీసు, చెంగలరావుపేట పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకున్నారని అన్నారు.

ఈ ఉచిత వైద్య శిబిరానికి సేవలందించిన డాక్టర్లు ఆదిత్త, భావన్, వి. సుందరి, భవ్యశ్రీ, ఉదయ్ కిరణ్, సి.హెచ్. కృష్ణ లను మరియు సాంకేతిక నిపుణులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం కోశాధికారి దుర్గా నూకేశ్వర రావు, మరియు సుగ్గు శివ, పాలూరి ప్రసాద్, పూసర్ల సురేష్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story