Tagarapuvalasa: శ్రీనగర్‌లో వైభవంగా వినాయక ఉత్సవాల పందిరి రాట

Tagarapuvalasa: తగరపువలస శ్రీనగర్‌లో వినాయక చవితి వేడుకల ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉత్సవ కమిటీ సభ్యులు పందిరి రాట వేడుక నిర్వహించారు.

SHIVA, BHIMILI
Published on: 31 Aug 2026 9:48 PM IST
Tagarapuvalasa
X

Tagarapuvalasa: శ్రీనగర్‌లో వైభవంగా వినాయక ఉత్సవాల పందిరి రాట

తగరపువలస: నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకునే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తగరపువలస ఒకటో వార్డు పరిధిలోని శ్రీనగర్‌లో ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఇక్కడి శ్రీనగర్ జంక్షన్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణలు నడుమ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘పందిరి రాట’ (శ్రీకారం) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధి పందిరి విజయ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా భారీ పందిరి, ఆకర్షణీయమైన గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నసమారాధనలు ఉంటాయని వెల్లడించారు.ఈ పందిరి రాట మహోత్సవంలో ప్రముఖులు అక్కరమాని రామనాయుడు, బంగి హరికిరణ్ రెడ్డి, జీరు వెంకటరెడ్డి, మణికంఠ ఫుడ్ కోర్ట్ అధినేత ఆదిమూలం నాగరాజు బ్రదర్స్, వెంపాడ శ్రీనివాసరెడ్డి, తమ్మిన సూరిబాబు, గారే చంద్రమౌళి, జీరు శ్రీనివాసరెడ్డి, ముక్కల రాజు, కోరాకుల నానితో పాటు శ్రీనగర్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాట వేయడంతో శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడే పండుగ వాతావరణం సంతరించుకుంది.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story