Pendurthi: పెందుర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి!
Pendurthi: విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Pendurthi: పెందుర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి!
పెందుర్తి: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో చోటుచేసుకుంది. పినగాడి గ్రామంలోని వితం కాలేజీలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గురువారం ఉదయం సెమిస్టర్ పరీక్షలు రాశారు. అనంతరం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
మృతులను అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలానికి చెందిన ఐజాక్, మాకవరపాలెం మండలం పోతలూరు గ్రామానికి చెందిన పోతల సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. ఒకే కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.




