Visakhapatnam: వృద్ధురాలి గొలుసు లాకెళ్లిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థుల అరెస్ట్
Visakhapatnam: విశాఖ పీఎంపాలెంలో వృద్ధురాలి గొలుసు లాకెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Visakhapatnam: వృద్ధురాలి గొలుసు లాకెళ్లిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థుల అరెస్ట్
విశాఖపట్నం: వృద్ధురాలిని అడ్డగించి మెడలోని బంగారు నల్లపూసల దండను లాక్కెళ్లిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను పీఎంపాలెం క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా సర్దానాకు చెందిన కమిల్ మాలిక్ (30), జావేద్ మాలిక్ (31)ను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు రూ.లక్ష విలువైన ఒక తులం పైగా బంగారు నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలను క్రైమ్ ఏసీపీ ఎ.వెంకటరావు బుధవారం పీఎంపాలెం క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు.మధురవాడ షిప్‌యార్డ్ కాలనీకి చెందిన పాంగా పుణ్యవతి (64) ఈ నెల 5న సాయంత్రం విజేత సూపర్‌మార్కెట్ సమీపంలోని ఎస్‌ఆర్ రాయల్ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి అడ్డగించాడు. ఆమె మెడలోని నల్లపూసల దండను లాక్కునేందుకు ప్రయత్నించాడు.
పుణ్యవతి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెగి నిందితుడి చేతికి చిక్కింది. ఈ పెనుగులాటలో ఆమె కిందపడగా నిందితుడు పరారయ్యాడు.బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలంతోపాటు కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు.
సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.కేసును ఛేదించిన క్రైమ్ నార్త్ సబ్‌డివిజన్ ఇన్‌స్పెక్టర్ బి.ఎస్.ఎస్.ప్రకాశ్, ఎస్‌ఐ ప్రకాశ్‌రావు, ఇతర సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.




