Madhurawada: జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాదిలో పోతిన హనుమంతరావు ప్రచారం!

Madhurawada: మధురవాడ జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాదిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోతిన హనుమంతరావు ప్రచారం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరిన హనుమంతరావు.

JAI RAM, MADURAWADA
Published on: 24 Oct 2026 10:07 PM IST
Madhurawada
X

Madhurawada: జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాదిలో పోతిన హనుమంతరావు ప్రచారం!

మధురవాడ: జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోని కొమ్మాది విలేజ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు.

ప్రచారంలో భాగంగా పోతిన హనుమంతరావు ప్రతి ఇంటికీ వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA