Vizag: విశాఖ రైల్వే జోన్.. ప్రజా పోరాట విజయం!

Vizag: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ విడుదల కావడంపై రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జె.వి. సత్యనారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు.

GOPI, PENDURTHI
Published on: 12 May 2026 4:22 PM IST
Vizag
X

Vizag: విశాఖ రైల్వే జోన్.. ప్రజా పోరాట విజయం!

Vizag: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తూ గెజిట్ ప్రకటన రాజకీయ పార్టీలు, పౌర, ప్రజాసంఘాల సమిష్టి విజయం అని రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జె.వి సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, పలువురు ప్రజాస్వామ్యం వాదులు కృషితో ఏర్పాటు చేసిన రైల్వే జోన్ సాధన సమితిగా ఉదృతంగా నడిపిన పోరాట ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని స్పష్టం చేశారు.

ఇది ఎ ఒక్క పార్టీ సాధించిన వ్యక్తిగత విజయం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చిన ఉ ద్యమమే రైల్వే జోన్ పోరాటం అని గుర్తు చేసారు. ఉద్యమం ప్రారంభం అయిన దశలో అధికార, ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు అనే తేడా లేకుండా అందరూ కలిసి రైల్వే జోన్ సాధన సమితిగా ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసి పోరాటాలు నిర్వహించడం మూలంగానే ఉ త్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం అయిందని పేర్కొన్నారు.

జూన్ 1 వ తేది నుండి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు నిర్వహణ ప్రకటన వెనుక అనేక మంది త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. సమితి నేతలు అనేక కేసులు, నిర్బందాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రైల్వే జోన్ సాధన సమితిలో సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, లోక్సత్తా, బీజేపీలోని ముఖ్యనాయకులు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

ఆ పోరాటాల నేపథ్యంలోలో రైల్వే బోర్డ్ చైర్మెన్ వివేక్ సహాయ్, రైల్వే మినిస్టర్ ముకుల్ రాయ్, సిపిఐ మాజీ ఎంపి అజిజ్ పాషా, అప్పటి కాంగ్రెస్ నేత రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పురందేశ్వరి వంటి నేతలు చాలా సాయం చేశారు వారి కృషిని గుర్తు చేసుకున్నారు. టీడీపీ సీనియర్ నేతలు కింజరాపు ఎర్రం నాయుడు, అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు దగ్గుపాటి పురుంధరేశ్వరి, కోట్ల జయ సూర్యప్రకాశరెడ్డి, కొణతాల రామకృష్ణ, ముత్తంశెట్టి అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్,

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స జాన్సీ, కిల్లి కృపారాణి శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, పి వి జి ఆర్ నాయుడు గణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, వంశీ కృష్ణ శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్, అప్పటి సిపిఎం నేత సి హెచ్ నరసింగరావు. లోకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్ది తదితరులు, రైల్వే జోన్ సాధన కోసం అన్ని రకాలైన సమాచారం ఎప్పటి కప్పుడు అందించిన రైల్వే రిటైర్ ఉద్యోగి రామారావు ప్రత్యక్షంగా పరోక్షంగా జోన్ సాధన కోసం కృషి చాలా గొప్పదని పేర్కొన్నారు.

పోరాటాల నేపథ్యంలో అందే జోన్ ఫలితాలు ఉత్తరాంధ్ర ప్రజలకు చేరేలా అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ విమల, జిల్లా కార్యదర్శి ఎస్ కె రహిమాన్, సహాయ కార్యదర్సులు కె సత్యనారాయణ, పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు ఎం పైడిరాజు, సి, ఎన్ క్షేత్రపాల్ రెడ్డి, ఎం మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story