Visakhapatnam: విశాఖ రేంజ్ పరిధిలో ఐజీపీ గోపీనాథ్ జట్టి ఉన్నతస్థాయి సమీక్ష
Visakhapatnam: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళా భద్రత, గంజాయి నిర్మూలనపై విశాఖ రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల ఎస్పీలతో ఐజీపీ గోపీనాథ్ జట్టి సమీక్షించారు.
Visakhapatnam: విశాఖ రేంజ్ పరిధిలో ఐజీపీ గోపీనాథ్ జట్టి ఉన్నతస్థాయి సమీక్ష
విశాఖపట్నం: విశాఖపట్నం రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్., గారు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్, ఐపీఎస్., పోలవరం జిల్లా ఎస్పీ శ్రీ కె.చక్రవర్తి, ఐపీఎస్., అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్., విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్., పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, ఐపీఎస్., శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, ఐపీఎస్.లతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆరు జిల్లాల ఎస్పీలు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో APOLIS, TRISHUL (మహిళలు మరియు బాలలపై నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, Zero Drugs, NDPS), హత్య కేసుల పెండింగ్ దర్యాప్తులు, లోక్ అదాలత్ కేసుల పరిష్కారం, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ NBWs, Smart Policing మరియు Cyber Crime అంశాలపై జిల్లాల వారీగా సమగ్రంగా సమీక్షించారు.
1. APOLIS: APOLISలో పోలీసు సిబ్బంది వివరాలను సక్రమంగా నమోదు చేసి, అందుబాటులో ఉన్న మాడ్యూళ్లను నిరంతరం వినియోగించేలా చూడాలి. ఎస్పీలు APOLIS వినియోగం, పెండింగ్ అంశాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి.
2. TRISHUL – మహిళలు & బాలల భద్రత: POCSO, Dowry Death, Adult Rape, Girl Missing తదితర UI కేసులను ప్రత్యేకంగా సమీక్షించి దర్యాప్తును వేగవంతం చేయాలి. మహిళలు, బాలలపై నేరాల విషయంలో Zero Tolerance విధానాన్ని అమలు చేయాలి.
3. Road Safety: ప్రమాదాల Patternను విశ్లేషించి Accident Black Spotsను గుర్తించి అవసరమైన Engineering & Enforcement చర్యలు చేపట్టాలి. Hit & Run కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను త్వరగా గుర్తించాలి.
4. Zero Drugs – NDPS: గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సాగు, రవాణా, నిల్వ, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలి. Supply Network, Financial Investigation మరియు అక్రమ ఆస్తుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అర్హులైన వారిపై PIT-NDPS ప్రతిపాదనలు త్వరగా పంపి, వచ్చిన డిటెన్షన్ ఆర్డర్లను ఆలస్యం లేకుండా అమలు చేయాలి. NDPS కేసుల్లో పెండింగ్ NBWsను వేగవంతంగా అమలు చేయాలి.
5. Cyber Crime/Smart Policing: సైబర్ క్రైమ్ కేసులలో ఫ్రీజ్ అయిన అమౌంట్ ను త్వరిత గతిన బాదితులకు అందెటట్లు చర్యలు తీసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ Smart Policingను మరింత బలోపేతం చేయాలని ఐజీపీ సూచించారు.
6. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత మరియు Pending NBWs: ప్రతి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, గత ఎన్నికల ఘటనలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన మరియు అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, స్థానిక పరిస్థితులు, గత నేర చరిత్ర, ప్రత్యర్థి వర్గాల వివాదాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక భద్రతా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
హింస, బెదిరింపులు, ఘర్షణలు, అక్రమ సమావేశాలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి నిరోధించేందుకు ముందస్తు పోలీసింగ్ చర్యలను బలోపేతం చేయాలని ఆదేశించారు. హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లు, పాత మరియు అలవాటైన నేరస్తులు, ట్రబుల్ మేకర్లు మరియు ఇతర సమస్యాత్మక వ్యక్తులను ముందుగానే గుర్తించి నిరంతర నిఘా ఉంచాలని, అవసరమైన చోట బైండ్‌ఓవర్ మరియు ఇతర ముందస్తు చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎన్నికల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న Non-Bailable Warrants (NBWs)ను ప్రత్యేక ప్రాధాన్యతతో సమీక్షించి, వాటి అమలును వేగవంతం చేయాలని ఐజీపీ ఆదేశించారు.
ఎస్పీల వ్యక్తిగత పర్యవేక్షణ:
ప్రతి జిల్లాలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లను ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలని ఐజీపీ ఆదేశించారు. ఎన్నికల ముందు నుంచే సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో అధికారులు మరియు సిబ్బందికి స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలని సూచించారు.




