Visakhapatnam: మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల అభివృద్ధి జరగాలి.. పల్లా కార్తీక్
Visakhapatnam: విశాఖపట్నంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారులను అభివృద్ధి చేయాలని పల్లా కార్తీక్ డిమాండ్ చేశారు.
Visakhapatnam: మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల అభివృద్ధి జరగాలి.. పల్లా కార్తీక్
Visakhapatnam: నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం తక్షణమే రోడ్లను అభివృద్ధి చేయాలని పల్లా కార్తీక్ డిమాండ్ చేశారు. విశాఖ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గాజువాక ప్రాంతంలో రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యం, రోడ్ల దుస్థితి కారణంగా నిత్యం అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలను మరియు నివేదికను మీడియాకు వెల్లడించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి, ఈ నివేదిక ఆధారంగా రోడ్లను త్వరితగతిన అభివృద్ధి చేయాలని, అప్పుడే ప్రమాదాలను అరికట్టడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎడ్ల సుమన్, ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




