Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం: టీచర్ కొట్టడంతో ఎల్‌కేజీ విద్యార్థి మృతి!
Visakhapatnam: వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ పాఠశాలలో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయపడి ఎల్‌కేజీ విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందాడు.
Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం: టీచర్ కొట్టడంతో ఎల్‌కేజీ విద్యార్థి మృతి!
విశాఖ: విశాఖ వన్ టౌన్ పరిధి లో ఉన్న లిటిల్ గార్డెన్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.హోంవర్క్ చేయలేదనే కారణంతో టీచర్ మందలించి, కొట్టడంతో ఎల్‌కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6) భయాందోళనకు గురై తీవ్ర అస్వస్థతతో తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. పాఠశాల యాజమాన్యం బాలుడిని వెంటనే కేజీహెచ్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
టీచర్ దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని,క్లాస్‌రూమ్‌లో పిల్లలను కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నాయని మృతుడి తల్లిదండ్రులు కృష్ణ ప్రసాద్,సాయి లక్ష్మి ఆరోపించారు.బాలుడి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు కేజీహెచ్ ముందు ఆందోళనకు దిగారు.ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.




