Visakhapatnam: తొలిరోజే ఓటర్ల డేటా చోరీకి పాల్పడ్డ టీడీపీ.. మాజీ ఎమ్మెల్యే
Visakhapatnam: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త గణేష్ ఆరోపించారు.
Visakhapatnam: తొలిరోజే ఓటర్ల డేటా చోరీకి పాల్పడ్డ టీడీపీ.. మాజీ ఎమ్మెల్యే
Visakhapatnam: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ( సర్) ప్రక్రియ లో వైయస్సార్సీపి బీఏలు బిఓల సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు ఆసీలమెట్ట కార్యాలయంలో మంగళవారం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ బిఏలకు వైసీపీ శ్రేణులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
ఈ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే టిడిపి నిసిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని అన్నారు. వైఎస్సార్సీపి ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ పేరుతో టిడిపి యాప్ ను రూపొందించారన్నారు. చట్ట విరుద్ధంగా చేస్తున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నామన్నారు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పై పెరుగుతున్న అభిమానం ప్రేమ చూసి ఓర్వలేని చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో గెలవాలన్న తన కపట బుద్ధిని సర్ పేరుతో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు ఈ విషయంపై ఇప్పటికే వైఎస్సార్ ఎస్ ఇ సి కి ఫిర్యాదు చేసిందన్నారు.
వైఎస్ఆర్సిపి మద్దతుదారులకు గుర్తిస్తే వారి ఓట్లను తొలగించేందుకు ఫారం -7 వాడాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దుర్మార్గపు ఆలోచనలు తిప్పి కొట్టే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా వారి అప్లికేషనులను పరిశీలించి లోటుపాట్లు సరిదిద్దెల బిఏలు పనిచేయాలన్నారు ఓటర్ల జాబితా వివరాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఇక్కడి ఏర్పాటు చేసినా రూమ్ వార్ లో తనతోపాటు న్యాయవాది, జిల్లా ఆర్టిఐ ప్రెసిడెంట్, పార్టీ సీనియర్ నాయకులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
ఎన్నికల అధికారుల వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు టిడిపి బిఎల్ఏలు వద్ద దర్శనమివ్వడం రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయన్నారు ఒక్కొక్క టిడిపి ఏజెంట్ బూతు పరిధిలో కనీసం 50 మంది వైఎస్ఆర్సిపి మద్దతుదారుల ఓట్ల తొలగించాలన్న టార్గెట్లో జరుగుతున్నాయన్నారు. జగనన్న అభిమానులు వైఎస్ఆర్సిపి శ్రేణులు ముఖ్యంగా బిఏలు అప్రమత్తంగా ఉండాలని వాసుపల్లి సూచించారు. ఓటర్ల డేటా చోరీకి పాల్పడుతున్న టిడిపి ఏజెంట్ల ప్రయత్నాలు పై డేగ కన్ను వెయ్యాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రెసిడెంట్స్ మూతబత్తుల రమేష్,అలుపన కనకరెడ్డి, మహమ్మద్ షాకిల్, గురజారపు రవి, ముజీబ్ ఖాన్, మాజీ కార్పొరేటర్ పత్చిపిళ్లి రాము,జిల్లా జనరల్ సెక్రటరీ గనగాళ్ల రామరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయి డేవిడ్ రాజు, స్టేట్ RTI సెక్రటరీ దస్మాంతుల చిన్ని, స్టేట్ సాంస్కృతి విభాగం సెక్రటరీ సాగర్, జిల్లా RTI సెల్ ప్రెసిడెంట్ వడ్డది దిలీప్, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర,జిల్లా sc సెల్ ఉపాధ్యక్షులు కోన శంకర్,
సౌత్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సువార్త రాజు, సౌత్ వైఎస్ఆర్టీఎఫ్ ప్రెసిడెంట్ దైవకుమార్, సౌత్ గ్రీవెన్స్ సెల్ఫ్ ప్రెసిడెంట్ మల్ల విజయ్, సౌత్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆకులు శ్యామ్, సౌత్ వికలాంగుల విభాగం ప్రెసిడెంట్ గరికిన చంద్ర శేఖర్,వార్డ్ మహిళ ప్రెసిడెంట్స్ సూరిని రాము, కొణతాల కృష్ణవేణి, దశమంతుల రామలక్ష్మి,రోజా, రమణి, వార్డ్ నాయాకులు మైలపిల్లి ఆదినారాయణ, చేపల నూకరాజు, మౌలేష్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, బిఏలు తదితరులు పాల్గొన్నారు.




