Madhurawada: జీవీఎంసీ 8వ వార్డులో పిల్లా రేవతి జోరుగా ఎన్నికల ప్రచారం!

Madhurawada: మధురవాడ జీవీఎంసీ 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి పిల్లా రేవతి ప్రచారం. 8వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ.

JAI RAM, MADURAWADA
Published on: 24 Oct 2026 10:12 PM IST
Madhurawada
X

Madhurawada: జీవీఎంసీ 8వ వార్డులో పిల్లా రేవతి జోరుగా ఎన్నికల ప్రచారం!

మధురవాడ: జీవీఎంసీ 8వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మధురవాడ పరిధిలోని స్వతంత్రనగర్, బాబుజీనగర్, డాక్‌యార్డ్ కాలనీ ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలను కలిసి వారి ఆశీస్సులు కోరారు. పలువురు మహిళలు ఆమెకు మద్దతు తెలుపుతూ ప్రోత్సహించడంతో రేవతి సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, 8వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

టీడీపీ సీనియర్ నాయకుడు పిల్లా నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లా నర్సింగరావు కోడలిగా, యువ నాయకుడు పిల్లా మోహన శివకృష్ణ సతీమణిగా ఎన్నికల బరిలో నిలిచిన పిల్లా రేవతి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA