Visakhapatnam: రోశయ్య విగ్రహావిష్కరణపై తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీవ్ర విమర్శలు
Visakhapatnam: విశాఖపట్నంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ మీడియాతో మాట్లాడారు. రోశయ్య విగ్రహావిష్కరణపై నారా లోకేష్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
Visakhapatnam: రోశయ్య విగ్రహావిష్కరణపై తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీవ్ర విమర్శలు
విశాఖపట్నం: కొణిజేటి రోశయ్య గారి సమకాలకులతో చేస్తుంటే నిజంగా అందరూ మెచ్చుకునేవారని కేవలం తన రాజకీయ లబ్ధి కోసం విశాఖలో తన ఆధిపత్యం కోసం పాకలాడుతున్నారు తప్ప రేపు విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించడం కోసం ఆడుతున్న నీచ రాజకీయ నాటకాలని సోమవారం మధ్యాహ్నం ఆల్ ఇండియా రేడియో పక్కన విశాఖపట్నంలో తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ హేళన చేశారు.
కొణిజేటి రోశయ్య రాజకీయ అనుభవం అంత (63) లేదు నారా లోకేష్ నీ వయసు (43), ఇలాంటి వ్యక్తితో విగ్రహావిష్కరణ చేయడం ఆర్య వైశ్యులు కు కాదు తెలుగు జాతికే అవమానం అని బి.వి.రామ్ అన్నారు. రోశయ్య గారి దగ్గర నేను చాలా విషయాలు రాజకీయంగా తెలుసుకున్నానని ఆయన దగ్గరికి ఎవరు ఎటువంటి సందేహాలు తో వెళ్లిన ఆ సందేహాలను పరిష్కారం అయ్యేలాగా చేసేవారే అలాంటి గొప్ప వ్యక్తిని ఇంత అవమానం చేయడం ఒక తెలుగు వాడిగా నేను చాలా బాధపడతాను ఇది పూర్తిగా యావత్ తెలుగు జాతి ఖండించాలని రామ్ పేర్కొన్నారు.
కొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 1959లో స్వతంత్ర పార్టీ ఆవిర్భావం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్.జి. రంగాతో కలిసి ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. తన 29వ ఏట 1962లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశం: స్వతంత్ర పార్టీ తర్వాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున 1968లో తొలిసారిగా శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1974,1980ల లో కూడా ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. అనేక మంత్రి పదవులు ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, రోడ్లు మరియు భవనాలు శాఖలో ఆయన ప్రతిపను చాటే వారు అలాగే ఆయన వైయస్సార్ మరణానంతరం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు ఆ తర్వాత 2011 నుంచి 2016 దాకా తమిళనాడు గవర్నర్ గా సేవలు అందించారు.




