Visakhapatnam: టిడ్కో ఇళ్లు కేటాయించాలంటూ విశాఖలో బాధితుల నిరసన!
Visakhapatnam: పదేళ్లుగా ఎదురుచూస్తున్నా టిడ్కో ఇళ్లు కేటాయించడం లేదంటూ విశాఖపట్నంలో బాధితుల నిరసన. కంచరపాలెం ఐటీఐ కూడలి వద్ద ధర్నా.
Visakhapatnam: టిడ్కో ఇళ్లు కేటాయించాలంటూ విశాఖలో బాధితుల నిరసన!
Visakhapatnam: ప్రభుత్వాలు మారినా సరే ఇళ్ల కోసం డబ్బులు కట్టి బాధపడుతున్న విశాఖపట్నం లొ పలు ప్రాంతాలకు చెందిన బాధితులు గాజువాక భానోజీ తోట గంట్యాడ రోడ్ విశాఖపట్నం కొంతమంది ఇల్లు లేని పేద ప్రజలకు గత పది సంవత్సరాల కిందట నుండి తిడ్కో ఇల్లులు ఇస్తామని కొంతమందికి ఇల్లు తాలూకా పట్టాలతో లోన్లు కట్టించుకునే మరియు కొంతమంది వారి వద్ద ఉన్న డబ్బులను అప్పులు చేసి ఈ ఇళ్ల కోసం కట్టించుకుని ఇప్పటివరకు ఆ ఇళ్లను వాళ్లకు అధికారుల చుట్టూ తిప్పడం తప్ప ఇప్పటివరకు ఇల్లు ఇవ్వడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం కంచరపాలెం ఐటిఐ కూడలి వద్ద వారు నిరసన చేపట్టారు ఇందులో భాగంగా ఇల్లులు కంప్లీట్ చేయకుండా రెండు ప్రభుత్వాలు మారిన ఆ ఇళ్లకు ఎటువంటి వసతులు కూడా కల్పించడం లేదని, నీటి సదుపాయము లేదు కరెంటు సదుపాయము లేదు, టాయిలెట్స్ బాత్రూంలో కూడా కట్టలేదని ఆరోపించారు.
ఇటువంటి ఇబ్బందులు ఉన్న ఇంటిలో తాము ఉండలేక ఆ ఇల్లు వాళ్లకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్లకు శాంక్షన్ అయిన ఇల్లులు ఇవ్వకుండా ఉన్న ఇళ్లలో అనేక రకాల జంతువులు గేదెలు ఆవులు పందులు లాస్ట్ కి గంజాయి కాల్చే వాళ్ళు కూడా ఆ యొక్క ఇళ్లలో ఉంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై తమ గోడును స్థానిక ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కు తెలియజేసినా పట్టించుకోలేదుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లొ బాధితులు పాల్గొన్నారు.




