Vizag: గూగుల్ డేటా సెంటర్.. లోకేష్ కృషితోనే సాధ్యం.. అనురాధ

Vizag: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ మరియు ఏఐ హబ్ ఏర్పాటు ద్వారా 1.80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 27 April 2026 4:47 PM IST
Vizag
X

Vizag: గూగుల్ డేటా సెంటర్.. లోకేష్ కృషితోనే సాధ్యం.. అనురాధ

Vizag: విశాఖపట్నాన్ని గ్లోబల్ టెక్ సిటీగా తీర్చిదిద్దే దిశగా గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ ఏర్పాటు కీలక అడుగని ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా యువనేత నారా లోకేష్ కృషి ఫలితమేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, విశాఖకు వైసీపీ గంజాయి తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం గూగుల్‌ను తీసుకువచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు.

*ప్రపంచ డేటా షేరింగ్‌లో విశాఖ కేంద్రం*

1 గిగావాట్ డేటా హబ్‌గా ఎదగనున్న నగరం విశాఖపట్నం త్వరలోనే ప్రపంచ స్థాయి డేటా షేరింగ్ కేంద్రంగా నిలవనుందని పంచుమర్తి అనురాధ తెలిపారు.గూగుల్ సంస్థకు 610 ఎకరాల భూమి కేటాయించామని, త్వరలో శంకుస్థాపన జరగనుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ 1 గిగావాట్ డేటా హబ్‌గా మారి, సబ్‌సీ కేబుల్స్ ద్వారా ప్రపంచానికి డేటా సేవలు అందించే కేంద్రంగా రూపుదిద్దుకోనుందని వివరించారు.

*1.80 లక్షల ఉద్యోగాల అవకాశాలు*

యువతకు భారీ స్థాయిలో ఉపాధి గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1.80 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని ఆమె పేర్కొన్నారు. క్లౌడ్ ఆపరేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, సర్వర్ తయారీ, కూలింగ్ టెక్నాలజీ వంటి రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

*2014 నుంచే చంద్రబాబు విజన్*

ఉత్తరాంధ్రను టెక్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం 2014లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రను ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ముందంజలో నిలబెట్టాలనే లక్ష్యంతో విశాఖను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు ప్రారంభించారని అనురాధ గుర్తుచేశారు. ఆయన కృషితో అనేక అంతర్జాతీయ సంస్థలు విశాఖకు వచ్చాయని, యువతకు వేలాది ఐటీ ఉద్యోగాలు లభించాయని చెప్పారు.

*వైసీపీ హయాంలో అభివృద్ధి నిలిచింది*

గంజాయి, భూకబ్జాలకు కేంద్రంగా విశాఖ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా స్తంభించిందని ఆమె ఆరోపించారు. వశాఖను గంజాయి, భూకబ్జాలు, కిడ్నాప్‌లు, బ్లాక్ మనీ, లిక్కర్ మాఫియా కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. ప్రజలు భయాందోళనల మధ్య జీవించే పరిస్థితి ఏర్పడిందన్నారు.

*గూగుల్ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు*

కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డంకులు గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించిందని పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

భూసేకరణను అడ్డుకోవాలని, రాయితీలు ఇవ్వొద్దని కోర్టుల్లో పిటిషన్లు వేసారని, విశాఖలో ఏర్పాటు అయ్యేది గూడౌన్ మాత్రమే అంటూ ప్రాజెక్ట్‌ను తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు. అయితే కోర్టు పెట్టుబడులకు అనుకూల వాతావరణం అవసరమని స్పష్టం చేసిందన్నారు.

*గుడివాడ అమర్నాథ్‌కు ప్రశ్నలు*

మీ హయాంలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? గుడివాడ అమర్నాథ్‌ను నేరుగా ప్రశ్నిస్తున్నానని పంచుమర్తి అనురాధ అన్నారు. మీ హయాంలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను మీరు వెళ్లగొట్టలేదా? వైజాగ్‌ను గంజాయి అడ్డాగా మార్చలేదా? రుషికొండను ధ్వంసం చేసి రూ.600 కోట్లతో ప్యాలెస్ కట్టలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

*ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరు*

5 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు గూగుల్ ప్రాజెక్ట్‌తో పాటు మరిన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు విశాఖకు రావడానికి ఆసక్తి చూపుతున్నాయని ఆమె తెలిపారు. ఉత్తరాంధ్రలో మొత్తం 5 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, విశాఖను ప్రపంచ పటంలో ఏఐ హబ్‌గా నిలబెట్టే ప్రయాణాన్ని ఇక ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story