Visakhapatnam: సీఐఐ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam: విశాఖ గంభీరం ఐఐఎంలో సీఐఐ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు సందర్శించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 7 Oct 2026 5:32 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: సీఐఐ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం: గంభీరం ఐఐఎంలో బుధవారం నిర్వహించిన సీఐఐ రీజనల్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు.

ఆయన వెంట రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ సంస్థల స్టాళ్లను వారు సందర్శించి, ప్రదర్శిస్తున్న ఉత్పత్తులు, సాంకేతికతలు, ఆవిష్కరణల గురించి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

సీఐఐ రీజనల్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వివిధ రంగాలకు చెందిన 25 సంస్థలు భాగస్వాయమయ్యాయి. ఉత్తరాంధ్రలోని పారిశ్రామిక, వ్యవసాయ, సాంకేతిక, ఆరోగ్య, హస్తకళలు, స్థానిక ఉత్పత్తుల వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనను ఏర్పాటు చేశాయి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.