Visakhapatnam: విశాఖ, విజయవాడ మేయర్ల విజయంపై గాదె బాలాజీ హర్షం

Visakhapatnam: విశాఖ మేయర్‌గా ముక్క శ్రావణి, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించడం పట్ల రాధా రంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ హర్షం.

PRAKASH, GAJUWAKA
Published on: 4 Nov 2026 11:26 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ, విజయవాడ మేయర్ల విజయంపై గాదె బాలాజీ హర్షం

విశాఖపట్నం: విశాఖపట్నం కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి గెలుపులో కీలక పాత్ర పోషించిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్‌కు, రాధా రంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా గెలుపొందిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గాదె బాలాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలునిర్వహించారు. అనంతరం గాదె బాలాజీ మాట్లాడుతూ, గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగరాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ముఖ్యంగా రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, నగరాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.ముక్క శ్రావణి, వంగవీటి రాధా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని గాదె బాలాజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA