Visakhapatnam: స్థానిక ఎన్నికలకు శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి

Visakhapatnam: విశాఖలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

JAI RAM, MADURAWADA
Published on: 8 Oct 2026 6:38 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: స్థానిక ఎన్నికలకు శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి

విశాఖపట్నం: స్థానిక సంస్థ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు గారు.. పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులతో సీతమ్మదార కార్యాలయంలో శ్రీ కె.కె. రాజు గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, నాయకులు మరియు కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. ప్రతి వార్డులో, ప్రతి ఇంటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిధ్వని వినిపించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని అన్నారు.

ఈ సమావేశంలో బాణాల శ్రీనివాసరావు,అల్లు శంకరరావు,రెయ్యి వెంకటరమణ,కె.అనిల్ కుమార్ రాజు,గుజ్జు వెంకటరెడ్డి,కడితి చిరంజీవి,నీలి రవి,కె.సుకుమార్,ఎర్రశెట్టి శ్రీనివాసరావు,సారిపిల్లి సంతోష్,బంగారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA