Anakapalli: అనకాపల్లిలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు!

Anakapalli: అనకాపల్లి గవరపాలెం శ్రీ కామాక్షి ఆలయంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు, వైభవంగా సాగిన రథోత్సవం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 17 Sept 2026 1:16 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు!

Anakapalli: పట్టణంలోని గవరపాలెంలో కొలువైన శ్రీ కామాక్షి ఆలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మండపంలో విశ్వకర్మ ఉత్సవ విగ్రహానికి ధవళేశ్వరపు లక్ష్మణరావు, మంజుల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం విశ్వకర్మ విగ్రహాన్ని రథంపై ప్రత్యేకంగా అలంకరించి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఊరేగింపును అనకాపల్లి బంగారు వర్తకుల సంఘం అధ్యక్షులు కొణతాల రాజేంద్ర ప్రారంభించారు. శ్రీ కామాక్షి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పట్టణంలోని పురవీధుల మీదుగా కొనసాగి అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి చేరుకుంది.

అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ కామాక్షి కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం రథోత్సవం తిరిగి శ్రీ కామాక్షి ఆలయానికి చేరుకుంది.

ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పొన్నాడ వెంకట సత్య నరసింహాచారి (పెదబాబు), ప్రధాన కార్యదర్శి యండపల్లి మోహన్ బ్రహ్మాజీ, కోశాధికారి కిల్లాడ శ్రీనివాసరావు, పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు వెదురుపత్తి సుందరయ్య (బాబి), పట్టణ కార్పెంటర్ సంఘం అధ్యక్షులు కోరుకొండ వెంకటరావుతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI