Visakhapatnam: స్వచ్ఛ ఆంధ్రాకై అల్లిపురంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. చీపురు పట్టిన నాగరాజు!
Visakhapatnam: విశాఖ 32వ వార్డు అల్లిపురంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' ప్రారంభం. స్వయంగా చీపురు పట్టి రోడ్లను క్లీన్ చేసిన ఆలయ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు.
Visakhapatnam: స్వచ్ఛ ఆంధ్రాకై అల్లిపురంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. చీపురు పట్టిన నాగరాజు!
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిశుభ్రమైన, సుస్థిర అభివృద్ధి సాధించిన ఆదర్శ రాష్ట్రంగా మార్చడానికి చేపట్టిన ఒక సమగ్ర ఉద్యమం "స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర" అని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, 32 వ వార్డు మాజీ కార్పొరేటర్, కె ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, పౌరులు భాగస్వామ్యమై పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 32వ వార్డు అల్లిపురం పరిసర ప్రాంతాలలో డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్లీప్ "ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం" కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా పరిసరాలను స్థానిక నాయకులతో కలిసి చీపురులు పట్టి స్వయంగా శుభ్రం చేశారు. రోడ్డు పక్కన ఉన్న వ్యర్ధాలను, పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం వ్యర్థాలను చెత్త తరలించే వాహనాల్లో వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రానున్న నెల రోజులపాటు పట్టణాల్లో పరిసరాలలో శుభ్రం చేయడం, ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలన్నారు. నగర పరిధిలోని అన్ని వార్డుల్లో కూటమి నాయకులు, నగరపాలక అధికారులతో కలిసి ప్రజలను భాగస్వామ్యం చేసుకొని,పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా విశాఖను స్వచ్ఛ విశాఖ నగరంగా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో 32 వ వార్డు ఎస్సై కీర్తి, సెక్రటరీలు, పిహెచ్ మేస్త్రి, సూపర్వైజర్, పిహెచ్ స్టాప్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




