Visakhapatnam: విశాఖ INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్‌‌కు గాయం

Visakhapatnam: విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా వద్ద కేంద్ర మంత్రి భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ కొండ ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 6 Oct 2026 5:50 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్‌‌కు గాయం

Visakhapatnam: విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద కేంద్ర మంత్రి విమాన భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌కు తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో గాయమైంది. మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఏఆర్‌ పీసీ 768 కొండ 15:00 నుంచి 18:00 గంటల వరకు సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు.

విధుల్లో ఉండగా ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో ఎడమవైపు ఛాతి కింద భాగంలో గాయమైంది. పెద్ద శబ్దం రావడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే అంబులెన్స్‌లో కిమ్స్ హాస్పిటల్ తరలించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.