Arilova: ఆరిలోవ విమ్స్ సమీపంలో అక్రమ గంజాయి రవాణా ఐదుగురి అరెస్ట్!

Arilova: ఆరిలోవ విమ్స్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురి అరెస్ట్. 3.055 కిలోల గంజాయి, స్కూటీ, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

SHIVA, BHIMILI
Published on: 13 Sept 2026 6:32 PM IST
Arilova
X

Arilova: ఆరిలోవ విమ్స్ సమీపంలో అక్రమ గంజాయి రవాణా ఐదుగురి అరెస్ట్!

Arilova: ​ఆరిలోవ విమ్స్ ఆసుపత్రి సమీపంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు.ఎస్‌ఐ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో సిటీ టాస్క్ ఫోర్స్, పోలీసు సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో బొబ్బిలి దినేష్ కుమార్, కడుపుట్ల సందీప్, మోకా రిషేంద్ర, తోట యశ్వంత్, ధనలను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న ధన, కట్టా రాము, సుంకర గౌతమ్‌ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుల నుంచి 3.055 కిలోల గంజాయి, ఒక యాక్టివా స్కూటీ, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

​ఈ మేరకు క్రైమ్ నెం. 261/2026 కింద NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. గంజాయి విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI