Vizag: భోగాపురం వచ్చినా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయొద్దు

Vizag: విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణుకుమార్ రాజు ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ANIL, VIZAG CITY
Published on: 14 Jun 2026 7:20 PM IST
Vizag
X

Vizag: భోగాపురం వచ్చినా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయొద్దు

Vizag: విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు M M N పరశురామ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ పాలన 4,400 రోజులను పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ, అంతర్గత దౌత్య విధానాలను అత్యంత సమర్థవంతంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ కేవలం మాటలు చెప్పే పార్టీ కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీ. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కోట్లాది మందికి గృహాలు అందించబడ్డాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశాం. అమృత్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోంది.

విశాఖపట్నం రైల్వే జోన్‌ను మోదీ ప్రభుత్వ హయాంలో సాధించగలిగాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శాశ్వత రైల్వే జోన్ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తాం. రైల్వే జోన్‌కు సంబంధించిన కొన్ని లాభదాయక స్టేషన్లు వెళ్లిపోయాయంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 19న విశాఖపట్నంలో భారీ సభను నిర్వహించనున్నాం.

2019 నుండి 2024 వరకు ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి, కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సుస్థిర పాలన అందిస్తోంది. విశాఖపట్నాన్ని మహానగరంగా అభివృద్ధి చేసేందుకు భారీ స్థాయిలో నిధులు కేటాయించబడుతున్నాయి. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయం పడటం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైనప్పటికీ, విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేయకుండా దేశీయ (డొమెస్టిక్) విమానాశ్రయంగా కొనసాగించాలి. ఉత్తరాంధ్ర ప్రాంతంపై వివక్ష చూపకుండా అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలు చేయాలి.

చమురు ధరలు తగ్గే వరకు విశాఖ విమానాశ్రయ సేవలను యథావిధిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. భోగాపురం విమానాశ్రయంతో పాటు విశాఖ విమానాశ్రయాన్ని కూడా కొనసాగించడం ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసిని ఆనంద్ మరియు జిల్లా మీడియా కన్వినర్ టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ANIL, VIZAG CITY

ANIL, VIZAG CITY