Visakhapatnam: స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ!
Visakhapatnam: జీవీఎంసీ స్థానిక ఎన్నికల వేళ విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి తనిఖీలు. గాజువాక BHPV, అగనంపూడి స్ట్రాంగ్ రూమ్‌లు, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత సమీక్ష.
Visakhapatnam: స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ!
విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి గారు గాజువాక బీహెచ్‌పీవీ (BHPV), అగనంపూడిలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ పర్యటనలో డీసీపీ జోన్-II శ్రీమతి మేరీ ప్రశాంతి, సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ శ్రీ వై. శ్రీనివాసరావు, గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ సీహెచ్. వాసు నాయుడు పాల్గొన్నారు.




