Vizag: తుఫాను ముందస్తు చర్యలు: రంగంలోకి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్!
Vizag: విశాఖలో భారీ వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Vizag: తుఫాను ముందస్తు చర్యలు: రంగంలోకి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్!
Vizag: భారీ వర్షాల నేపథ్యంలో వెస్ట్, నార్త్ జోన్లలో పర్యటించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలి: కమిషనర్. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలి.
అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
నార్త్ జోన్ 57వ వార్డు ఇందిరానగర్–1లో కొండవాలు ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్. ప్రమాదకర ప్రాంతాల ప్రజలు సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి: కమిషనర్ కేతన్ గార్గ్. సిటీ ఆపరేషన్స్ సెంటర్‌లో వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సమీక్షించిన కమిషనర్.
చెట్లు కూలడం, కాలువలు పొంగిపొర్లడం, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు కూలే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టాలి.
ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన.. నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. అత్యవసర సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009, వాట్సాప్ 90142 18870 నంబర్కు ఫోన్ చేయండి. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత.. తుఫాను పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండండి.




