Vizag: జోరువానలోనూ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పర్యటన!
Vizag: నెల్లూరు ఫతేఖాన్‌పేటలో ఘనంగా జరుగుతున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో భక్తులు రూ.50,116కు లడ్డూను దక్కించుకున్నారు.
Vizag: జోరువానలోనూ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పర్యటన!
Vizag: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలో పలుచోట్ల కొండచరియలు, మట్టి దిబ్బలు విరిగిపడి నివాసాలు కొంతమేర ముప్పును ఎదుర్కొంటున్నాయి.
ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన చేపట్టారు.
59వ వార్డు హనుమాన్ నగర్, 63వ వార్డు పరిధిలోని కాకరలోవ, క్రాంతి నగర్ వంటి అత్యంత సమస్యాత్మక కొండవాలు ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు. కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న ఇళ్లను నిశితంగా పరిశీలించి, భయాందోళనల్లో ఉన్న స్థానికులతో నేరుగా మాట్లాడారు.
"ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది.. ఎలాంటి ఆందోళన చెందవద్దు" అంటూ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపారు. జీవీఎంసీ, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఎమ్మెల్యే అక్కడికక్కడే సమీక్షించారు.




