Vizag: శ్రీ సత్యసాయి సంస్థల స్కిల్ డెవలప్‌మెంట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Vizag: విశాఖపట్నంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో SDP పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాల్‌లో ఘనంగా జరిగింది.
Vizag: శ్రీ సత్యసాయి సంస్థల స్కిల్ డెవలప్‌మెంట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Vizag: నేడు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ (SDPs) లో శిక్షణ పొందిన వివిధ వృత్తులకు చెందిన 550 మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విశాఖపట్నంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాలులో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము పొందిన శిక్షణ, ఆ శిక్షణ ద్వారా పొందిన అనుభవాలు, ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకున్నారో వివరించారు. అలాగే శిక్షణ ద్వారా మానవతా విలువలు, సేవాభావం మరియు వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా అలవర్చుకున్నారో హృదయాన్ని హత్తుకునే విధంగా పంచుకొని అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి భవ్య రెడ్డి గారు, ACP (Crimes) Vizag, నేటి యువత డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలను కూడా నేర్చుకొని తమ ఉపాధి అవకాశాలను మరింత విస్తరించుకోవాలని సూచించారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు తన ఉత్తేజభరిత ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు. స్వామివారి బోధనలు, మానవ విలువలు, సేవా తత్వం మరియు నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను వివరిస్తూ పూర్వ విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుండి హెల్త్ కేర్ అసిస్టెంట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించడానికి లభించిన అనుమతి పత్రాన్ని సభాముఖంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ టి.ఆర్.ఎస్. నాయుడు గారు, రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌చార్జి శ్రీ నాగప్రసాద్ గారు, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌చార్జి శ్రీ కె. సత్యనారాయణ మూర్తి గారు, శ్రీమతి అపర్ణ గాru, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీ గోవిందరావు గారు హెల్త్ కేర్ అసిస్టెంట్ శిక్షణా కార్యక్రమాన్ని . మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని, అనంతరం స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి, నూతన ఉత్సాహంతో తమ తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.
“Love All – Serve All” అనే స్వామివారి సందేశాన్ని ఆచరిస్తూ, నైపుణ్యంతో కూడిన సేవా జీవితాన్ని గడపాలని అందరూ సంకల్పించారు.




