Vizag: యోగా వేడుక‌ల‌కు అంద‌రూ ఆహ్వానితులే.. జిల్లా క‌లెక్ట‌ర్

Vizag: విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా జూన్ 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సాదర ఆహ్వానం పలికారు.

GOPI, PENDURTHI
Published on: 16 Jun 2026 8:45 PM IST
Vizag
X

Vizag: యోగా వేడుక‌ల‌కు అంద‌రూ ఆహ్వానితులే.. జిల్లా క‌లెక్ట‌ర్

Vizag: ఈ నెల 21వ తేదీ ఉద‌యం 6.00 నుంచి 7.00 గంట‌ల వ‌ర‌కు విశాఖ‌ప‌ట్ట‌ణం ఆర్కేబీచ్ వేదిక‌గా జ‌రిగే 12వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుక‌ల‌కు అంద‌రూ ఆహ్వానితులేనని త‌ప్ప‌క విచ్చేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్ విజ్ఞ‌ప్తి చేశారు. మీడియా ప్ర‌తినిధులు,

జిల్లాలో ఉండే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌ని చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ర‌క్ష‌ణ ద‌ళాల్లో సేవ‌లందించే ఉన్న‌తాధికారులు, ఉద్యోగులు, పోర్టు, రైల్వే, పోస్ట‌ల్ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు, విద్యా సంస్థ‌ల నిర్వాహ‌కులు, బోధ‌కులు, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు,

ప్ర‌జా ప్ర‌తినిధులు, సీనియ‌ర్ సిటిజ‌న్లు, యోగా నిపుణులు, స్వ‌యం స‌హాయ సంఘాల మ‌హిళ‌లు, విద్యార్థులు త‌దిత‌ర అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కార్యక్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిస్తూ మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న ద్వారా ఆయ‌న ఆహ్వానం తెలిపారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story