Visakhapatnam: విశాఖ వీఎంఆర్డీఏకి పూర్తిస్థాయి కమిషనర్ ఏరి?
Visakhapatnam: విశాఖపట్నం వీఎంఆర్డీఏకి పూర్తిస్థాయి కమిషనర్ లేక పనులు మందగించాయి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో పర్యవేక్షణ కష్టంగా మారింది.
Visakhapatnam: విశాఖ వీఎంఆర్డీఏకి పూర్తిస్థాయి కమిషనర్ ఏరి?
Visakhapatnam: విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) కు మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమితులైన ప్రఖర్ జైన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న తేజ్‌భరత్‌ను ఆగస్టు ఏడో తేదీన బదిలీ చేశారు. ఆ స్థానంలో విజయవాడలో ఆర్టీజీఎస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రఖర్ జైను నియమించారు. తేజ్‌భరత్ ఆగస్టు 8న ఇక్కడి విధుల నుంచి రిలీవ్ అయి వెళ్లిపోయారు.
అయితే విజయవాడలో ప్రఖర్ జైన్‌ను అధికారులు రిలీవ్ చేయడం లేదు. అక్కడ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విభేదాలే దీనికి కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారం కిందట జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్్కు ఇన్చార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి జీవీఎంసీ కంటే వీఎంఆర్డీఏ పరిధి ఎక్కువ.
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) బాధ్యతలు కూడా వీఎంఆర్డీఏ కమిషనర్, కట్టబెట్టారు. నీతి ఆయోగ్ బృందం నిత్యం వీఈఆర్ ప్రాజెక్టులను సమీక్షిస్తోంది. ఈ పనుల కోసం అప్పటి కమిషనర్ తేజ్‌భరత్ అదనపు అధికారులు అవసరమని డిప్యూటేషన్‌పై రప్పించుకున్నారు. వీఎంఆర్డీఏలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.
జీవీఎంసీ కమిషనర్ ఉదయం ఆరు గంటల నుంచే క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలు చూసుకోవాల్సి ఉంది. ఒకే అధికారి జీవీఎంసీ, వీఎంఆర్డీఏ బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువు కాదు. మూడు వారాలుగా పూర్తిస్థాయి
అధికారులు లేక వీఎంఆర్డీఏలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం విశాఖపట్నానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందున పర్యాటకం సహా అనేక ప్రాజెక్టులు సజావుగా సాగేందుకు వెంటనే వీఎంఆర్డీఏ కమిషనర్‌ను నియమించాల్సి ఉంది.




