Chintapalli: ప్రతి స్థానంలో మనమే గెలుస్తాం.. నో డౌట్: గిడ్డి ఈశ్వరి
Chintapalli: చింతపల్లి మండల కూటమి సమన్వయ సమావేశంలో పాడేరు టీడీపీ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి ప్రసంగిస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Chintapalli: ప్రతి స్థానంలో మనమే గెలుస్తాం.. నో డౌట్: గిడ్డి ఈశ్వరి
అల్లూరి జిల్లా: చింతపల్లి మండల కూటమి పార్టీల సమన్వయ సమావేశంలో టిడిపి పాడేరు ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి కూటమి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ
ప్రతి స్థానంలోనూ కూటమి అభ్యర్థి మాత్రమే గెలవాలని... మనమే గెలుస్తాం... నో డౌట్" అంటూ తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి , మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
చింతపల్లి మండల కూటమి పార్టీల సమన్వయ సమావేశం సోమవారం చింతపల్లిలో జరిగింది ఈ కార్యక్రమానికి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాడేరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఈశ్వరి మాట్లాడుతూ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ నుంచి గల్లి వరకు కూటమి పార్టీలే విజయం సాధిస్తే ఒక్క పాడేరు అరకులో మాత్రమే మనం ఓటమి చెందామని గుర్తు చేశారు.
ఏది ఏమైనా రాబోయ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు మండలాల్లో ఎంపీపీలు, జడ్పిటిసి స్థానాలను గెలిచి తీరాలన్నారు. 184 ఎంపీటీసీ సిగ్నెంట్లలో విజయం సాధించాలని అంత సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు
అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రత్యేకంగా రెండు నియోజకవర్గాలతో ఏర్పడడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా కొత్తగా ఏర్పాటు అయిందన్నారు. ఆ పదవిని మనమంతా సమర్థవంతంగా పనిచేసి కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
త్రిబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని ఇప్పటివరకు డబల్ ఇంజిన్ తోనే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబల్ ఇంజిన్ సర్కార్ తో గిరిజన ప్రాంతంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఒకపక్క సంక్షేమాన్ని మరొకపక్క అభివృద్ధిని సమాంతరంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పట్ల విమర్శ చేయడానికి కూడా అవకాశం ప్రతిపక్షాలకు దొరకలేదన్నారు. గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేద్దామని అన్నారు. గెలిచే అభ్యర్థులు ఎవరైనాప్పటికీ గెలుస్తాడు అనుకుంటా అతనికి సీటు కేటాయించాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.




