Araku: మంత్రి సంధ్యారాణి అధ్యక్షతన స్థానిక ఎన్నికల సన్నాహక భేటీ!
Araku: అల్లూరి జిల్లాలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం.. అన్ని స్థానాలు కైవసం చేసుకునేలా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపు.
Araku: మంత్రి సంధ్యారాణి అధ్యక్షతన స్థానిక ఎన్నికల సన్నాహక భేటీ!
Araku: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతి ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకునేలా అంతా ఐక్యంగా పని చేద్దామని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీమతి గిడ్డి ఈశ్వరి అన్నారు.
అరకు గిరిజన సంక్షేమ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి స్థానం కూటమి అభ్యర్థి గెలిచే విధంగా వ్యూహాలను రచించాలని కార్యకర్తలకు సూచించారు. మీ మీ సిగ్మెంట్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో ఎంతమందికి సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరిందో ఆ ప్రాంతానికి జరిగిన మేలు గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసి అక్కడ వివరించాలని గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడాపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఎక్కడకక్కడే స్థానిక సమస్యలపైనా, అభివృద్ధి పైనా సంక్షేమ పథకాల పైనా పట్టు సాధించాలని ఆమె సూచించారు. నియోజకవర్గం వ్యాప్తంగా సమస్యలు ఒకే రకంగా ఉండవని ఏ సెగ్మెంట్ కు ఆ సిగ్మెంట్ ప్రత్యేకంగా సమస్యలు ఉంటాయని వాటిని గుర్తించి మనకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరిష్కరించామో తెలుసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరినీ కలవాలని మనం చేసిన మేలని వివరించాలని సూచించారు.




