Pendurthi: నరవలో భూకబ్జాపై గళమెత్తిన మహిళ.. జనసేన నేత మద్దతు!

Pendurthi: జీవీఎంసీ 88వ వార్డు నరవలో తన స్థలాన్ని బడాబాబులు దౌర్జన్యంగా ఆక్రమించారని బాధిత మహిళ అమ్మాజీ వాపోయారు.

GOPI, PENDURTHI
Published on: 6 Sept 2026 10:35 PM IST
Pendurthi
X

Pendurthi: నరవలో భూకబ్జాపై గళమెత్తిన మహిళ.. జనసేన నేత మద్దతు!

పెందుర్తి: నా భూమిని అన్యాయంగా ఆక్ర‌మించుకున్నారు... న్యాయం చేయండి మ‌హాప్ర‌భో అంటూ జీవిఎంసీ 88వ వార్డు న‌ర‌వ గ్రామానికి చెందిన అమ్మాజీ అనే మ‌హిళ ఆంధోళ‌న వెలిబుచ్చారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో బ్రాహ్మ‌ణుల నుండి ఆ భూమిని కొనుగోలు చేపి, అందులో బ‌డ్డీ పెట్టుకొని చిన్న‌వ్యాపారం చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాన‌ని తెలిపారు.

అయితే ప‌క్క‌నే భారీ భ‌వంతి నిర్మిస్తున్న గ్రామానికి చెందిన బ‌డాబాబులు, త‌న భూమిని ఆక్ర‌మించి దౌర్జ‌న్యంగా ప్ర‌హారీ క‌ట్టేసార‌ని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. నా భ‌ర్త విక‌లాంగుడు అని, కొడుకులిద్ద‌రూ ఆర్మీలో ప‌నిచేసార‌ని వివ‌రించారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పెందుర్తి రెవెన్యూ అధికారులు, పోలీసులు, జీవిఎంసీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వెలిబుచ్చారు.

ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి త‌న భూమిని త‌న‌కు ఇప్పించాల‌ని అమ్మాజీ మీడియా ముఖంగా అధికారుల‌కు విజ్ణ‌ప్తిచేసారు. మ‌రోవైపు స్థానిక‌ జ‌న‌సేన నాయ‌కుడు, పెందుర్తి మార్కెట్ క‌మిటీ డైరెక్ట‌ర్ గ‌ల్లా శ్రీనివాస‌రావును ఆశ్రయించడంతో ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. అక్క‌డ నిర్మిస్తున్న భ‌వ‌నానికి సర్వే నెంబ‌రు 44లో అనుమ‌తులు తీసుకొని, స‌ర్వే నెంబ‌రు 126/3లోని ప్ర‌భుత్వ‌భూమిలో అక్రమంగా నిర్మాణం చేయడమే కాక తన సంబంధించిన మాకు సంబంధించిన సర్వే నెంబర్ 44 గల స్థలంలో అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై పిజీఆర్ఎస్ లో ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా స‌రిగా అధికారులు స్పందించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు. గ‌తంలో ఆభూమిని ప్ర‌భుత్వ‌భూమిగా గుర్తించిన రెవెన్యూ, జీవిఎంసీ అధికారులు తూతూ మంత్రంగా చ‌ర్య‌లు చేప‌ట్టి చేతులు దులిపేసుకున్నార‌ని మండిప‌డ్డారు. అధికారుల నిర్ల‌క్ష్యంపై అమ‌రావ‌తిలోని పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ‌కు ఫిర్యాదు చేయ‌గా, ఆ లఅనుమతులు ర‌ద్దుకు సిఫార్సు చేసార‌ని వెల్ల‌డించారు.

మ‌రోవైపు స‌ర్వేనెంబ‌రు 126 /3 లో గ‌ల‌ ప్ర‌భుత్వ‌భూమిని షీలాన‌గ‌ర్ రిజిస్ట్రార్ అధికారులు ప్రైవేటు వ్య‌క్తుల‌కు ఎలా రిజిస్ట్రేష‌న్ చేసారో అర్ధం కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా అధికారులు స‌రిగా స్పందించ‌క‌పోతే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకెల్తాన‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ‌భూమిని కాపాడేందుకు ఎక్క‌డివ‌ర‌కైనా వెళ్తాన‌ని జ‌న‌సేన నాయ‌కుడు గ‌ల్లా శ్రీనివాసరావు స్ప‌ష్టం చేసారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story