Anakapalle: జీవీఎంసీ 108వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిత్వంపై యల్లపు శ్రీనివాస్ ఆసక్తి!

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోని 108వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతున్న జనసేన నాయకుడు యల్లపు శ్రీనివాస్.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Oct 2026 1:19 PM IST
Anakapalle
X

Anakapalle: జీవీఎంసీ 108వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిత్వంపై యల్లపు శ్రీనివాస్ ఆసక్తి!

Anakapalle: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలోని 108వ వార్డు కార్పొరేటర్ స్థానంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ వార్డు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు జనసేన నాయకుడు యల్లపు శ్రీనివాస్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

కూటమి తరఫున 108వ వార్డులో తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జనసేన పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి భీమరశెట్టి రాంకీలను యల్లపు శ్రీనివాస్ కోరారు. 1989 నుంచి కొణతాల రామకృష్ణతో తనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం కొనసాగుతోందని ఆయన తెలిపారు. కూటమి తరఫున అవకాశం కల్పిస్తే ఎన్నికల్లో విజయం కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు.

అనకాపల్లి జోన్ పరిధిలోని గవరపాలెంలో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న తాను బీసీ-డీ గవర సామాజిక వర్గానికి చెందినవాడినని యల్లపు శ్రీనివాస్ తెలిపారు. గత కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు.

అలాగే గౌరీ పీఎస్ బ్యాంక్ డైరెక్టర్‌గా, గౌరీ గంధాలయం వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పనిచేశానని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం పనిచేస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు. అన్ని వర్గాలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, స్థానికంగా తనకు ఉన్న పరిచయాలు, పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని 108వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. 108వ వార్డుకు కూటమి అభ్యర్థి ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI