Visakhapatnam: యోగా ప్రపంచానికి ఇండియా ఇచ్చిన అమృత భాండం: పీవీఎన్ మాధవ్!
Visakhapatnam: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. యోగా ప్రాముఖ్యతపై ఆయన కీలక వ్యాఖ్యలు.
Visakhapatnam: యోగా ప్రపంచానికి ఇండియా ఇచ్చిన అమృత భాండం: పీవీఎన్ మాధవ్!
Visakhapatnam: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచమంతా యోగమయం కావాలనే మహోన్నత సంకల్పంతో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచ వేదికపై స్థాపించారని అన్నారు. నేడు ప్రపంచంలోని వందలాది దేశాలు యోగాను స్వీకరించి ఆరోగ్యవంతమైన జీవన విధానంగా అనుసరిస్తుండటం భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
యోగం అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనసు, శరీరం మరియు ప్రకృతిని అనుసంధానించే జీవన విధానమని తెలిపారు. సమతుల్యత, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యాన్ని అందించే గొప్ప సాధన యోగమని చెప్పారు.
భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన “వసుధైవ కుటుంబకం” అనే సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచ వేదికపై మరింత బలంగా చాటిచెప్పారని పేర్కొన్నారు. జీ-20 సదస్సులో “వన్ ఎర్త్ – వన్ ఫ్యామిలీ – వన్ ఫ్యూచర్” అనే నినాదం ద్వారా ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భారతీయ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని “యోగా ఆంధ్ర”గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యోగాను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తున్నారని అభినందించారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి గ్రామానికి యోగా కార్యక్రమాలను విస్తరించడం అభినందనీయమని అన్నారు. విజయవాడలో బాబా రామ్‌దేవ్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది పాల్గొన్న యోగా కార్యక్రమం రాష్ట్రంలో యోగా పట్ల పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
యోగం భారతదేశం ప్రపంచానికి అందించిన “అమృత భాండం” అని, దీనిపై ఎటువంటి మేధో సంపత్తి హక్కులు ప్రకటించకుండా సమస్త మానవాళి శ్రేయస్సు కోసం భారతదేశం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పీవీఎన్ మాధవ్ గారు పిలుపునిచ్చారు.




