Vizag: నేవల్ డాక్ యార్డ్ లో యోగాంధ్ర కార్యక్రమం

Vizag: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో 'యోగాంధ్ర' కార్యక్రమం ఘనంగా జరిగింది.

GOPI, PENDURTHI
Published on: 11 Jun 2026 5:21 PM IST
Vizag
X

Vizag: నేవల్ డాక్ యార్డ్ లో యోగాంధ్ర కార్యక్రమం

Vizag: యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని, 21వ తేదీన ఆర్కే బీచ్ లో నిర్వహించే ప్రపంచ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు.

12 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పరిష్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నేవల్ డాక్ యార్డ్ నందు యోగా కార్యక్రమం భారత నౌకా దళం మరియు జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు నౌకా దళ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి జ్యోతి ప్రజ్యాలన చేసి ప్రారంభించారు.

ఆంధ్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తులసిరావు, ఆయుష్ బృందం ఆధ్వర్యంలో యోగాసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభిషిక్త్ కిషోర్ ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నావెల్ డాక్ యార్డ్ నందు యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా 12వ తేదీన రుషి కొండ బీచ్ నందు, 15వ తేదీన ముడసర్లోవ గోల్ఫ్ కోర్ట్ నందు యోగ కార్యక్రమాలు నిర్వహించబడతాయని,

21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆర్కే బీచ్ నందు నిర్వహించ బడుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా సాధన చేయాలని, తద్వారా ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్ డి ఒ అఖిల్ సూర్యాతేజ్, రిటైర్డ్ వింగ్ కమాండర్ పి సి శేఖర్, ఆయుష్ శాఖ ఆర్ డి డి శ్రీనివాసులు, నోడల్ అధికారి డా. చంద్రశేఖర్, నావల్ అధికారులు, జిల్లా అధికారులు, మాజీ సైనికులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story