Anakapalli: అనకాపల్లి జిల్లాలో విషాదం: నూతిలో పడి యువ జంట మృతి!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది యువ జంట నూతిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో విషాదం: నూతిలో పడి యువ జంట మృతి!
Anakapalli: మృతులను డొంగల కన్సిక సత్యసాగర్ (16), షీలా అరుణ (16)గా గుర్తింపు.. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు సమాచారం.. వివాహానికి అరుణ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో గతంలో పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయిన జంట...
కుటుంబ సభ్యులు వారిని తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్లలో కౌన్సెలింగ్... ఇటీవల కూడా ఇంటి నుంచి వెళ్లిపోయి కలిసి నివసిస్తున్నట్లు కుటుంబ సభ్యుల వెల్లడి.. ఇవాళ ఇద్దరూ నూతిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం..
ఘటనాస్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు.. తమకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు తెలిపిన కుటుంబ సభ్యులు.. సత్యసాగర్ రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్‌ను పోలీసులకు అందజేసిన కుటుంబ సభ్యులు..
ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సంఘటనా స్థల పరిశీలన, పోస్టుమార్టం, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు.




