Visakhapatnam: విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి!
Visakhapatnam: జీవీఎంసీ 10వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన ప్రమీల ప్రచారంలో భీమిలి ఇన్‌చార్జ్ బొత్స అనూష.
Visakhapatnam: విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి!
Visakhapatnam: విశాఖ నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బొత్స అనూష అన్నారు. జీవీఎంసీ 10వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన ప్రమీల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
మధురవాడతో పాటు నగరంలోని పలు వార్డుల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని బొత్స అనూష పేర్కొన్నారు. విశాఖలో ఇలాంటి తాగునీటి సమస్యను గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డేటా సెంటర్‌కు అనుమతులు ఇచ్చామని, అయితే దాని ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని తెలిపారు. ఇప్పటికే తాగునీటి కొరత ఉన్న నేపథ్యంలో డేటా సెంటర్ ఏర్పాటు జరిగితే నగర అవసరాలకు నీటిని ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా, కంపెనీలకు అతి తక్కువ ధరలకు భూములు కేటాయిస్తున్నారని ఆమె విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు, పెరుగుతున్న బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపశమనం కలిగించేలా సబ్సిడీలు అందించాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని బొత్స అనూష స్పష్టం చేశారు. ‘సేవ్ వైజాగ్’ నినాదంతో విశాఖ ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణిని, 10వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోతిన ప్రమీలను బరిలో నిలిపినట్లు పేర్కొన్నారు. 10వ వార్డు ప్రజలు పోతిన ప్రమీలకు, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 120 మంది అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




