Anakapalli: అనకాపల్లిలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు
Anakapalli: అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేట, తాకశి వీధుల్లో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొని పూజలు చేశారు.
Anakapalli: అనకాపల్లిలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు
అనకాపల్లి: పట్టణ పరిధిలోని విజయరామరాజుపేట, తాకశి వీధుల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, 84వ వార్డు అధ్యక్షులు కోరుకొండ రాఘవ, 82వ వార్డు అధ్యక్షులు అల్లు త్రినాధ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు.
వేడుకల్లో విజయరామరాజుపేట యాదవ సంఘం పెద్దలు, తాకశి వీధి పెద్దలు, శ్రీకృష్ణ యువజన సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.




