Vizag: కూటమి రెండేళ్ల నమ్మకం కాదు.. రెండేళ్ల వెన్నుపోటు.. కల్యాణి
Vizag: విశాఖ వైసిపి ఆఫీస్ లో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు.
Vizag: కూటమి రెండేళ్ల నమ్మకం కాదు.. రెండేళ్ల వెన్నుపోటు.. కల్యాణి
Vizag: కూటమి రెండేళ్ల సభకు 'రెండేళ్ల నమ్మకం' కాదు.. 'రెండేళ్ల వెన్నుపోటు, సంక్షోభం' అని పేరు పెట్టాలి: వరుదు కల్యాణి. ఎన్నికల ప్రచారంలో మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని బాండ్లు పంచి ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో 'ఆడబిడ్డ నిధి' పథకానికి అర్హులైన 2 కోట్ల మంది మహిళలను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది.
ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ విగ్రహానికి దండవేసి ప్రకటించిన 'ఆడబిడ్డ నిధి'ని చంద్రబాబు అటకెక్కించారు. జగన్ ప్రభుత్వంలో 'చేయూత' ద్వారా క్రమం తప్పకుండా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. 18 నుండి 60 ఏళ్ల లోపు మహిళలందరికీ నెలకు రూ.1500 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేయకుండా తూట్లు పొడిచారు. ఎన్నికల సమయంలో 'ఆడబిడ్డ నిధి', 'పీ-4' వేర్వేరు అని చెప్పి.. ఇప్పుడు రెండూ ఒక్కటేనంటూ మాట మార్చారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే.. నేడు 'ఆడబిడ్డ నిధి' అమలులో మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.
ఎన్నికల ప్రచారంలో రజనీకాంత్‌లా హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక గజనీలా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు. నాడు 'స్వాతిముత్యం' కమల్ హాసన్‌లా నటించిన బాబు.. నేడు 'నాయకుడు' సినిమాలోని కన్నింగ్ పాత్రలా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ మోసం చేశారు.
'తల్లికి వందనం' కింద ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తామన్న హామీ ఎటు పోయింది? 'అన్నదాత సుఖీభవ' కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి, గడిచిన రెండేళ్లలో రూపాయి కూడా కేటాయించలేదు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో మోసం చేసిన చంద్రబాబు నాయుడు కాదు.. 'చీటింగ్ బోగస్ నాయుడు'. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌లోనూ 'ఆడబిడ్డ నిధి' పథకం ఊసే లేదు. 'తల్లికి వందనం' మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు.. రెండో ఏడాది రూ.2 వేలు కోత పెట్టారు. ఈ ఏడాది కూడా బడ్జెట్ కేటాయింపులు లేక 'తల్లికి వందనం' పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రైతు భరోసా విషయంలో కేంద్రం ఇచ్చే నిధులను చూపిస్తూ కూటమి నేతలు లబ్ధిదారులను పక్కదారి పట్టిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం ఘోరంగా వంచించింది. ధైర్యం ఉంటే కూటమి నేతలు ప్రజల ఇళ్లకు వెళ్లి 'సూపర్ సిక్స్' అమలు చేశామని చెప్పాలి.
జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలు.. మహిళలను, ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీలను పూర్తిగా అమలు చేసే వరకు వైయస్సార్సీపీ పోరాటం ఆపదు.




